పుష్ప పై మొదటి సారి స్పందించిన విలన్..సినిమా కథ అలాంటిది..!

Fahadh Faasil about pushpa movie
Fahadh Faasil about pushpa movie

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజీ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ప్రస్తుతం కేరళలో సినిమా షూటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు మరియు ఫస్ట్ గ్లిమ్ప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతే కాకుండా అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా సినిమా టీజర్ ను విడుదల చేస్తానని చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఇక ఈ సినిమాలో మలయాళ నటుడు ఫహాద్ ఫాసిల్ విలన్ గా నటిస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ఫహాద్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. యాంకర్ ఫాసిల్ తో మీరు అల్లు అర్జున్ పక్కన పుష్ప లో విలన్ గా నటిస్తున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు అని ప్రశ్నించగా…ఫాసిల్ మాట్లాడుతూ…పుష్ప కథ చెప్పినప్పుడు చాలా ఎక్సయిటింగ్ గా ఫీల్ అయ్యాను అన్నారు. ఇది ఒక ఫ్రెష్ స్టోరీ అని అన్నారు. అంతే కాకుండా తాను రంగస్థలం సినిమా చూశానని సినిమా చాలా బాగుందని ఫాసిల్ వ్యాఖ్యానించారు.