ఇట్స్ అఫీషియ‌ల్‌..అల్లు అర్జున్ కు విల‌న్ గా ఫ‌హ‌ద్ ఫ‌సిల్..!

  • Written By: Last Updated:
ఇట్స్ అఫీషియ‌ల్‌..అల్లు అర్జున్ కు విల‌న్ గా ఫ‌హ‌ద్ ఫ‌సిల్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా రష్మిక మందన నటిస్తోంది. సినిమాలో అల్లు అర్జున్ డ్రైవర్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. అల్లు అర్జున్ మొదటి సారి అలాంటి పాత్ర చేయడం తో అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సినిమా నుండి విడుదలైన పోస్టర్ లు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే సినిమాలో విలన్ పాత్ర కూడా అల్లు అర్జున్ కు సరి తూగేలా ఉండాలని సుకుమార్ అనుకున్నారు. దాంతో మొదట విలన్ పాత్ర కోసం తమిళ నటుడు విజయ్ సేతుపతిని సంప్రదించారు.

అయితే డేట్స్ సమస్య కారణంగా విజయ్ సేతుపతి ఈ చిత్రానికి నో చెప్పారు. ఆ తరవాత సినిమాలో విలన్ గా తమిళ హీరో ఆర్య నటిస్తారని టాక్ వినిపించింది. అయితే దానిపై కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. అంతే కాకుండా అల్లు అర్జున్ కు విలన్ గా మంచు మనోజ్ పేరు కూడా వినిపించింది. అయితే అది కూడా జరగలేదు. కాగా తాజాగా అల్లు అర్జున్ కు విలన్ గా మలయాళ హీరో ఫహాద్ ఫసిల్ ను ఎంపిక చేసినట్టు మేకర్స్ ప్రకటించారు. ఫహాద్ మలయాళం లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. ఇటీవల ఆయన నటించిన ట్రాన్స్ సినిమాను తెలుగులో డబ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

follow us

Related News