వివాదం లో నెట్ ఫ్లిక్స్ “ఏ సూటబుల్ బోయ్” !!

  • Written By: Last Updated:
వివాదం లో నెట్ ఫ్లిక్స్ “ఏ సూటబుల్ బోయ్” !!

కరోనా కారణం గా థియేటర్స్ మూత పడటం తో సినిమాలు, వెబ్ సిరీస్ లకు ఓటీటీ వేదిక అయింది. సెన్సార్ సర్టిఫికేట్ లేకుండానే ఓటీటీ లో విడుదల అవ్వుతున్నాయి. దర్శకులు కూడా సెక్సువాలిటీ, వల్గర్ లాంగ్వేజ్ ఉన్నటువంటి కథలతో తీస్తున్నారు. వీటిని ఎంకరేజ్ చెయ్యడంలో ఓటీటీ లు ముందుంటున్నాయి. ఎంత మసాలా ఉంటే అంతా రేటింగ్ అనే విదంగా ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్ లు ఉన్నాయి.

నెట్ ఫ్లిక్స్ లో “ఏ సూటబుల్ బోయ్” అనే వెబ్ సిరీస్ విడుదలైంది. ఇందులో అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంది. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు హిందువుల మనోభావాలను దెబ్బ తీసే విదంగా ఉన్నాయని, మధ్య ప్రదేశ్ లో కేస్ వేశారు. షూటింగ్ టైమ్ లో హిందువుల ఆలయాల ప్రాంగణంలో ఘాటు ఘాటు ముద్దు సీన్స్ ను చిత్రీకరించారు. అలాంటి సన్నివేశాలు మరెక్కడైనా షూట్ చేసుకోవాలి కానీ ఎంతో పవిత్రంగా ఉండే ఆలయాల ముందు ఇలాంటి సీన్స్ తీస్తే భవిష్యత్తులో ఆ ప్రభావం ఇప్పటి జెనరేషన్స్ పై పడుతుందని భావించి, నెట్ ఫ్లిక్స్ కు చెందిన ఇద్దరు ఎగ్జిక్యూటివ్ లు… మోనికా షెర్గిల్, అంబికా ఖురానాల పేర్లను ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఈ విషయాని మధ్యప్రదేశ్ హొ మంత్రి నరోత్తం మిశ్రా తెలియజేశారు. వెంటనే ఆ సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ వెబ్ సిరీస్ లో టబు కూడా నటించింది.

follow us