నడిగర్ సంఘం భవనం లో అగ్ని ప్రమాదం !!

ప్రస్తుతం నడిగర్ సంఘం అధ్యక్షుడి గా నాజర్, కార్యదర్శి గా విశాల్ లు ఉన్నారు గత కొంతకాలం గా వీరిపై నడిగర్ సంఘంలో ఆరోపణలు వస్తున్నాయి అందుకు కారణం ఏమిటి అంటే నడిగర్ భవన నిర్మాణం కోసం విశాల్, నాజర్ లు కొన్ని కార్యక్రమాలను నిర్వహించారు. ఒక్కొక్క కార్యక్రమానికి ఒక్కో అమౌంట్ ను కలెక్ట్ చేశారు. ఆ మొత్తం నిధి 10 కోట్లకు పైగా ఉంటుందని అంచన. గత కొంతకాలంగా ఆ నిధులకు సంబందించి లెక్కలు అడుగుతున్న విశాల్, నాజర్ లు సమదానం చెప్పకుండా దాటేస్తూ వస్తున్నారు. ఆ సమయంలోనే నిధులు పక్క దారి పట్టాయాని ఆరోపణలు వచ్చాయి. అందుకు సంబందించిన కీలక పత్రాలను చూపించాలిసిందే అని నడిగర్ సంగంలోని కొంత మంది సభ్యులు ప్రశ్నించేసరికి అదే రోజు నడిగర్ సంఘం భవనంలో అగ్నికి ఆహుతి అయింది. అందులోని కీలక పాత్రలు పూర్తిగా దగ్దం అయినట్లుగా సమాచారం.
నడిగర్ భవనం కాలిపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది. విశాల్ కన్నా ముందు నడిగర్ సంఘం అధ్యక్షుడిగా శరత్ కుమార్ ఉన్నారు. ఆయన హయాంలో నిధులు దుర్వినియోగం అయ్యాయని చెప్పి విశాల్ నడిగర్ సంఘం ఎలక్షన్స్ లో గెలిచాడు. అందుకు సంబందించిన పత్రాలు కూడా అదే భవనంలో ఉన్నట్లుగా సమాచారం. ఇక పోలీసు ల విచారణలో నిజంగా అగ్ని ప్రమాదం జరిగిందా ? లేక ఎవరైనా కావాలని చేశారా? అనే విషయం తెలియాలిసి ఉంది.