హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ లో మొదటి కరోనా పాజిటివ్ కేసు.

కరోనా వైరస్ కేసులు తెలంగాణ రాష్టంలో రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఈ  రోజు సీఎం కెసిఆర్ ప్రెస్ మీట్ లో లాక్ డౌన్  ఎక్స్టెండ్  చేయమని మోడీ ని  కోరారని  చెప్పారు. 

అయితే పోలీసులు , డాక్టర్స్ అనుక్షణం వాళ్ళ డ్యూటీ చేస్తున్న సమయం ఇది.. మోడీ ఇచ్చిన  పిలుపు తో వాళ్ళ కోసం జనతా కర్ఫ్యూ రోజున సాయంత్రం 5 గంటలకు భారత దేశం అంత ఎవరి ఇళ్ల ముందుకు వాళ్ళు వచ్చి గంటలు కొట్టి సంగిభావం తెలిపాము కూడా.. 

దురదృష్టం  ఏమిటి అంటే సైదాబాద్  పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ లో మొదటి కరుణ పాజిటివ్ కేసు. హెడ్ కానిస్టేబుల్ తో ప్రైమరీ కాంటాక్ట్ అయిన 12 మంది పోలీస్ సిబ్బందిని క్వారన్ టైన్ సెంటర్ కి తరలించారు  అధికారులు. వీరితో పాటు 10 మంది కుటుంబ సభ్యులను కూడా  క్వారన్ టైన్ సెంటర్ కి తరలించారు . అందరికి పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు,  ఇతనికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదు  తెలుస్తుంది..

హెడ్ కానిస్టేబుల్ ఇంకా ఎవరెవరిని కలిసాడు అని దార్యప్తు చేస్తున్నారు పోలీసులు.