తెలంగాణ, ఢిల్లీలో మొదటి కరోనా కేసు..

First of Coronavirus confirmed in Delhi, Telangana.
First of Coronavirus confirmed in Delhi, Telangana.

తెలంగాణలో మొదటి కరోనా కేసు నమోదు కావడంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది , ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కరోనా పై సాయంత్రం నాలుగు గంటలకి అధికారికంగా మీడియాతో మాట్లాడనున్నారు. కరోనా పై ఆందోళన పడొద్దని, తెలంగాణా ప్రభుత్వం కరోనా విషయంలో అప్రమత్తంగా ఉందన్నారు.

అయితే కరోనా వైరస్ దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన వ్యక్తికి కరోనా వ్యాధి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈమేరకు వార్డ్ లో పెట్టి అతనికి చికిత్స చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది మరోవైపు ఢిల్లీలో కూడా మరో కేసు నమోదైంది ఇటలీ నుంచి ఢిల్లీకి వచ్చిన వ్యక్తికి ఈ వ్యాధి సోకినట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు ఇండియాలో రెండు కేసులు నమోదైనట్లు కేంద్రం ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.