ఎఫ్3 లో ఈసారి అయిదుగురు ! ఇక నవ్వులే నవ్వులు !

వరస విజయాలతో దూసుకుపోతున్న అనీల్ రావిపూడి ఎఫ్ 2 కి సిక్వెల్ గా ఎఫ్3ని ప్లాన్ చేస్తున్నాడు. అందుకోసం గత కొన్ని నెలలుగా ఎఫ్3 స్క్రిప్ట్ వర్క్ పై బిజీగా ఉన్నాడు. తాజా సమాచారం మేరకు ఈ చిత్రంలో మొత్తం అయిదుగురు హీరోయిన్స్ ఉండనున్నారంట. ఎఫ్ 2 లో నటించిన వెంకటేష్, వరుణ్ తేజ్ ల బృందం మరోసారి ఎఫ్3 లోనూ కనిపిస్తుంది.
తమన్నా, మెహరిన్ లు కాకుండానే మరో ఇద్దరు హీరోయిన్స్ ను తీసుకొనున్నారని సమాచారం. స్పెషల్ సాంగ్ కోసం మరో హీరోయిన్ ను తీసుకుంటున్నారు. మొత్తం కలిపి అయిదుగురు హీరోయిన్స్ కనిపిస్తారు. అనీల్ రావిపూడి కి ఉన్న సెంటిమెంట్ ప్రకారం గతంలో తన సినిమాలో నటించిన ఓ హీరోయిన్ కి తన నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ ఇస్తుంటాడు.
రాజా ది గ్రేట్ చిత్రంలో నటించిన మెహరిన్ కి ఎఫ్ 2 లో ఛాన్స్ ఇచ్చాడు. సరిలేరు నికేవ్వరు చిత్రంలో నటించిన రష్మిక మందన్నా కు ఎఫ్ 3 లో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది అని మీడియా వర్గాల కథనాలు. ఎఫ్3 ను వచ్చే వారం నుండి సెట్స్ పైకి తీసుకెళ్లడానికి అనీల్ ప్లాన్ చేస్తున్నాడు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.