లక్స్ పాపను తన మాజీ ప్రియుడు చితకబాదడట

లక్స్ పాపను తన మాజీ ప్రియుడు చితకబాదడట

నరసింహ నాయుడు మూవీ లో లక్స్ పాప గా యూత్ ను ఆకట్టుకున్న ఆశా షైనీ ని తాజాగా తన మాజీ ప్రియుడు చిత్ర హింసలకు గురిచేసాడట. 1999 లో ప్రేమకోసం అనే సినిమాతో తన కెరీర్ ప్రారంభించింది. రజినీకాంత్, విజయకాంత్, బాలకృష్ణ, వెంకటేష్, ప్రభు, కార్తీక్, జగపతి బాబు, రాజశేఖర్ లాంటి నటుల సరసన సుమారు 50 కి పైగా సినిమాల్లో నటించి మెప్పించింది ఈ బ్యూటీ. ఆ తర్వాత కొత్త హీరోయిన్ల రాకతో అమ్మడికి ఛాన్సులు లేకుండాపోయాయి.

ఆ తర్వాత నిర్మాత గౌరంగ్ దోషితో ఆషా షైనీ రిలేషన్ నడిపింది. ఇద్దరు కలిసి ముంబై లో ఉండేవారు. అయితే గౌరంగ్ వేధింపులపై ఆషా షైనీ 2018లో నోరు విప్పారు. అప్పటి గాయాలతో కూడిన ఫోటోలు ఆమె బయటపెట్టారు. సదరు ఫొటోల్లో ఆషా షైనీ గాయాలతో, దవడ పక్కకు జరిగి భయంకరంగా ఉన్నారు. తాజా ఇంటర్వ్యూలో ప్రియుడు చేతిలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు తెలియజేసి అందరికి షాక్ ఇచ్చింది. ఆమెను మాజీ ప్రియుడు దారుణంగా కొట్టాడట. తన దవడ విరగడంతో పాటు తీవ్ర గాయాలపాలయ్యారట. ఈ మధ్య ప్రేమించానని వేధించడం..ఆ తర్వాత ప్రేమించిన వారిని చిత్ర హింసలకు గురి చేయడం చేయడం చేస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో శ్రద్ధ వాకర్ అనే యువతిని ప్రియుడు అఫ్తాబ్ హత్య చేశాడు. శ్రద్దా శరీరాన్ని ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్ లో ఉంచాడు. ఆ శరీర భాగాలను రోజుకి కొంత మొత్తంలో జనసంచారం లేని ప్రదేశాల్లో విసిరి వేశాడు. దేశవ్యాప్తంగా ఈ సంఘటన కలకలం రేపింది.

Tags

follow us