ప్రభాస్ కోసం రూ. 10 కోట్ల ఖర్చుతో ఓల్డ్ థియేటర్ ..

ప్రభాస్ కోసం రూ. 10 కోట్ల ఖర్చుతో ఓల్డ్ థియేటర్ ..

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత సాహో , రాధే శ్యామ్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను అలరించలేకపోయాయి. ప్రస్తుతం ఆదిపురుష్ , ప్రాజెక్ట్ కె మూవీస్ తో పాటు సిక్స్ ఫుల్ డైరెక్టర్ మారుతీ డైరెక్షన్లో ఓ మూవీ హర్రర్ మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ తాలూకా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకోగా..త్వరలో రెండో షెడ్యూల్ మొదలుపెట్టబోతున్నారు.

ఈ షెడ్యూల్ ను ఓ పాత థియేటర్ లో షూట్ చేయబోతున్నారట. ఇందుకోసం హైదరాబాద్ శివారు ప్రాంతంలో దాదాపు 10 కోట్ల రూపాయలను ఖర్చు చేసి పాత థియేటర్ సెట్టింగ్ ను నిర్మించారట. ఆ థియేటర్ పేరు రాజా డీలక్స్ అని అంటున్నారు. సినిమాలోని మెజార్టీ సన్నివేశాలు మరియు కీలకమైన హర్రర్ సీన్స్ ను థియేటర్ లో చిత్రీకరించబోతున్నారట. కనుకే కాస్త ఎక్కువ ఖర్చు చేసి మరీ ఈ సినిమా కోసం ఆ సెట్ ను నిర్మించారని అంటున్నారు. దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీ లో ముగ్గురు భామలు ప్రభాస్ కు జోడి కట్టబోతున్నారని అంటున్నారు.

follow us