ఎస్. వి రంగారావు మేనల్లుడు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే హఠాన్మరణం

టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండేటి కోట రామ రావు (బుజ్జి ) .. తూర్పు గోదావరికి చెందిన ఈ నేత ఏలూరు ని స్మార్ట్ సిటీ చేయాలనీ చాలా ఆశించారు, శ్రమించారు కానీ ఇలా ఆయన మరణం ఏలూరు కి తీరని లోటు ..
నిన్న అర్ధరాత్రి గుండెపోటు రావడం తో ఆయనని దగ్గరలోని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందారు .. ఈ మరణం తో టీడీపీ కి తీరని లోటు.. చిన్న వయసు లోనే ఒక నాయకుడిని పోగొట్టుకుంది ఏలూరు టీడీపీ..
టీడీపీ శ్రేణులు అందరూ ఆయన నివాసానికి చేరుకుంటున్నారు.. అలానే చంద్రబాబు నాయుడు ఇంకా నారా లోకేష్ కూడా ఈ హఠాన్మరణం తెలుసుకొని దిగ్బ్రాంతికి లోనయ్యారు..
ఈయన దివంగత నటుడు ఎస్. వి రంగారావు మేనల్లుడు..
రాజకీయ జీవితం :
2009 లో ప్రజారాజ్యం లో చేరి ఏలూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు.. తరువాత రాజకీయ పరిణామాల మేర టీడీపీ లో చేరి గెలుపొందారు.. 2019 లో కూడా అయన కేవలం 4072 ఓట్ల తేడా తో ఆళ్ల నాని మీద ఓడిపోయారు..