హీరో ఆర్య పై మోడీకి ఫిర్యాదు చేసిన జర్మన్ యువతి..పెళ్లి చేసుకుంటా అని చెప్పి అలా

german woman complaints against hero arya as he cheated her pretext of marriage
german woman complaints against hero arya as he cheated her pretext of marriage

తమిళ యంగ్ హీరో ఆర్య పై జర్మన్ యువతి సంచలన ఆరోపణలు చేస్తుంది. తనను పెళ్లి చేసుకుంటా అని మోసం చేశాడని ఏకంగా ప్రధానమంత్రి, రాష్ట్ర పతికి లేఖ రాసి ఫిర్యాదు చేసింది. సదరు జర్మన్ యువతి చెన్నైలో మెడికల్ ఫీల్డ్ లో ఉద్యోగం చేస్తుంది. ఇస్మాయిల్ అనే వ్యక్తి ద్వారా తనకు ఆర్య పరిచయం అయ్యాడని చెబుతుంది. ఇద్దరూ కలిసి తన వద్ద రూ.80 లక్షలు తీసుకున్నారని ఆరోపిస్తోంది. అంతే కాకుండా తనతో పాటు పలువురిని ఆర్య మోసం చేశాడని చెబుతోంది. ఆర్య తల్లి జమిలా కూడా తనకు పరిచాయమేనని ఆమె సమక్షంలోనే డబ్బులు ఇచ్చినట్టు వెల్లడించింది.

ఇప్పటివరకు పలు పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు చేసినప్పటికీ…వాళ్ళు చర్యలు తీసుకోలేదని చెబుతోంది. ఇక ఈ విషయంపై ఇప్పటి వరకు ఆర్య స్పందించలేదు. మరి ఇప్పుడైనా స్పందిస్తారో లేదో చూడాలి. ఇదిలా ఉండగా ఆర్య తమిళ్ లో చాలా సినిమాల్లో నటించారు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితుడే. అల్లు అర్జున్ హీరోగా నటించిన వరుడు సినిమాలో ఆర్య విలన్ గా నటించి అలరించారు. ఇక రాజా రాణి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.