భారీగా తగ్గిన బంగారం ధర…ఇంకెంత చవక అవుతుందో తెలుసా..?

హైదరాబాద్ లో బంగారం ధర తులం (10 గ్రాములు) మేలిమి బంగారం (24 కేరట్లు) ధర రూ.39288 ఉండగా, విజయవాడలో రూ.39286, వైజాగ్ రూ.39285, నెల్లూరులో రూ.39281 ధర పలికింది.
బంగారం ధరలు అంతర్జాతీయంగా భారీగా పతనం బాట పడుతున్నాయి. దీంతో పసిడి ప్రేమికులు ఆభరణాలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. న్యూయార్క్ బులియన్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర ఏకంగా 1468 డాలర్లకు పతనం అయ్యింది. సరిగ్గా రెండు నెలల క్రితం ఔన్సు బంగారం ధర 1530 డాలర్ల వద్ద గరిష్ట స్థాయిని అందుకుంది. అటు హైదరాబాద్ లో బంగారం ధర తులం (10 గ్రాములు) మేలిమి బంగారం (24 కేరట్లు) ధర రూ.39288 ఉండగా, విజయవాడలో రూ.39286, వైజాగ్ రూ.39285, నెల్లూరులో రూ.39281 ధర పలికింది. అటు హైదరాబాద్ లో ఆభరణాల బంగారం (22 కేరట్స్) ధర 10 గ్రాముల ధర రూ.36,350గా పలుకుతోంది. అదే సమయంలో విజయవాడలో సైతం రూ.36400గా పలుకుతోంది.
ముఖ్యంగా రూపాయి బలపడటంతో పాటు యూఎస్, చైనా మధ్య వాణిజ్య ఒప్పందాలు సైతం బంగారం ధరల స్థిరీకరణకు దోహదం చేశాయి. అలాగే దేశీయంగా కూడా బంగారం కొనుగోళ్లకు డిమాండ్ తగ్గడం కూడా పరోక్ష కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు భవిష్యత్తులో మరింత తగ్గే అవకాశం ఉందని, ఇప్పటికే తులం మేలిమి బంగారం ధర 40 వేల దిగువకు పతనం అవగా, మున్ముందు మరింత తగ్గవచ్చని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
News18:Source