సీటీమార్ టీజర్ : కబడ్డీ కోర్ట్ లో ఆడితే ఆట..భయట ఆడితే వేట

gopichand seetimar movie teaser (2)
gopichand seetimar movie teaser (2)

మ్యాచో మ్యాన్ గోపిచంద్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా “సీటీమార్”. ఈ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో గోపిచంద్ కు జోడిగా తమన్నా నటిస్తోంది. ఇక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గోపిచంద్ ఆంధ్రా కబడ్డీ టీమ్ క్యాప్టెన్ గా నటిస్తుండగా…తమన్నా తెలంగాణ కబడ్డీ జట్టు క్యాప్టెన్ గా నటిస్తుంది. సినిమాలో నటి భూమిక కూడా కీలక పాత్రలో నటిస్తుంది. ఇక ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలను అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్ లకు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. కాగా టీజర్ లో మ్యాచో మ్యాన్ ఆకట్టుకున్నారు. ఇక ఈ టీజర్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంది. చిత్రంలో విలనిజం కూడా భాగా ఉండబోతుందని..పక్కా మాస్ సినిమా అని తెలిసిపోతుంది. అంతే కాకుండా డైలాగ్స్ కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. “కబడ్డీ కోర్ట్ లోపల ఆడితే ఆట..భయట ఆడితే వేట” అంటూ గోపిచంద్ విలన్ లను వేటాడుతున్నాడు. ఇక సినిమా ఎలా ఉంటుందో చూడాలి.