థియేటర్ కాదు ఓటీటీలోనే సీటీమారో ..!

మ్యాచో మ్యాన్ గోపీచంద్ మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటించిన సినిమా సీటీమార్. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. సినిమాలో తమన్నా తెలంగాణ కబడ్డీ కోచ్ గా నటిస్తుండగా గోపీచంద్ ఆంధ్రా కబడ్డీ జట్టుకు కోచ్ గా నటిచారు. ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహించారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ మరియు ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంతే కాకుండా ఈ సిసినమాను ఎప్రిల్ 2 న విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ అప్టటివరకు సినిమాకు సంభందించిన వీఎఫ్ఎక్స్ వర్క్ పెండిగ్ ఉండటం వల్ల సినిమా విడుదలను అకస్మాత్తుగా నిలిపివేశారు.
త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు. కాని మళ్లీ కరోనా విజృంభనతో థియేటర్లకు తాళం వేసుకునే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని గోపీచంద్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. అంతే కాకుండా ఈ సినిమాకు మంచి ఆఫర్ ఇవ్వడంతోనే నిర్మాతలు ఒప్పుకున్నారట.