రాధేశ్యామ్ క‌థ‌పై పుకార్లు…పూజా పాత్ర అలాంటిద‌ట‌..!

gossips on radheshyam movie
gossips on radheshyam movie

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పూజ హెడ్గే జంటగా నటిస్తున్న సినిమా “రాధే శ్యామ్”. ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పిరియాడికల్ ప్రేమ కథ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాపై ఫిల్మ్ నగర్ లో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రంలో పూజా హెడ్గే ఇటలీలోని ఓ యూనివర్సిటీలో మెడిసిన్ చదువుతూ ఉంటుందట. అయితే అదే ఆస్పత్రికి ప్రభాస్ వెళ్లగా అక్కడ హీరోకు చికిత్స చేసే క్రమంలో పూజ పడిపోతుందట. దాంతో ఇద్దరూ ప్రేమలో పడతారన్నది ప్రస్తుతం వినిపిస్తున్న సినిమా కథ.

అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేవరకు వెయిట్ చేయాల్సిందే. ఇదిలా ఉండగా ఇప్పటికే రాధే శ్యామ్ సినిమా షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తోంది. అయితే సినిమా లో కొన్నీ సీన్లు ప్రభాస్ కు అంతగా నచ్చకపోవడం తో ఆ సీన్లను రీషూట్ చేస్తున్నారు. మరో పది రోజులపాటు రాధే శ్యామ్ కోసం షెడ్యూల్ ను వేసుకున్నారు. ఇక ప్రభాస్ ఈ పది రోజుల తరవాత మళ్ళీ సలార్ షూటింగ్ లో పాల్గొంటారు. సలార్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న తరవాత ఆగస్టు లో ఆదిపురుష్ షూటింగ్ లో పాల్గొంటారు.