సింధి సంప్రదాయంలో జరిగిన హన్సిక వివాహం

దేశ ముదురు బ్యూటీ హన్సిక ఓ ఇంటిది అయ్యింది. తన ప్రియుడు, బిజినెస్ పార్ట్ నర్ సొహైల్ ను ఆమె వివాహం చేసుకుంది. దేశ ముదురు మూవీ తో తెలుగు లో ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది..మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని , యూత్ కు దగ్గరైంది. ఈ మూవీ తర్వాత తెలుగు లో పలు సినిమాలు చేసినప్పటికీ స్టార్ హీరోయిన్ రేంజ్ కి మాత్రం చేరుకోలేకపోయింది. కానీ తమిళ్ లో మాత్రం అమ్మడు వరుస ఛాన్సులు రాబట్టుకొని , అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళింది. ఆ తర్వాత కొత్త భామల ఎంట్రీ తో అమ్మడికి ఛాన్సులు తగ్గుతూ వచ్చాయి.
దీంతో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యి..తన ప్రియుడు, బిజినెస్ పార్ట్ నర్ సొహైల్ తో ఏడూ అడుగులు వేసింది. జైపూర్ లోని ఒక రాజకోటలో వీరి వివాహం నిన్న అంగరంగ వైభవంగా జరిగింది. సింధి సంప్రదాయంలో పెళ్లిని నిర్వహించారు. కుటుంబసభ్యులు, సన్నిహితులు ఈ వివాహానికి హాజరయ్యారు. కాగా… సొహైల్ కు రెండో వివాహం కావడం గమనార్హం. హన్సిక స్నేహితురాలితోనే ఆయనకు తొలి వివాహం అయింది. కొన్ని కారణాల వల్ల వీరు విడిపోయారు. ఆ తర్వాత హన్సిక, సొహైల్ మధ్య ప్రేమాయణం సాగింది. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.