బాలకృష్ణ 60వ బర్త్డే స్పెషల్

నందమూరి బాలకృష్ణ ఈ రోజు 60 వ పుట్టిన రోజు జరుపుకుంటున్న వేళ సినీ చిట్ చాట్ స్పెషల్ ఆర్టికల్..
బాలకృష్ణ వైవిధ్యానికి మారు రూపం. ఆ నాటి హీరోల్లో పౌరాణికాలు చేయడానికి ఒకరికి ధైర్యం లేదు అనే చెప్పాలి.. భైరవ ద్వీపం సినిమా చేసిన బాలయ్య బాబే.. ఆదిత్య 369 తీసిన బాలయ్య బాబే..
పౌరుషానికి ప్రతి రూపం.. సమరసింహా రెడ్డి అంటూ ఫ్యాక్షన్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది బాలయ్య బాబు..
నటనలో తనకంటూ ప్రత్యేకమైన స్టైల్ ను పెంపొందించుకున్నారు.. ఫ్యాన్స్ లో గుండెల్లో ఆయనకు ప్రత్యేక స్థానం..
ఎవరికి దక్కుతుంది బాలయ్య బాబు అదృష్టం : తండ్రి తో నటించడం, తండ్రి దర్శకత్వం లో సినిమా చేయడం.. తండ్రి అడుగు జాడలు పట్టుకొని రాజకీయాల్లోకి అడుగు పెట్టడం.. ఇవి అన్ని కేవలం బాలయ్య బాబు కు దక్కిన అదృష్టం మాత్రమే..
ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల వరకు స్టార్ హీరోలు , స్టార్ నాయకులు ఆయనకు ఆనాటి నుంచి ఈ నాటి వరకు రక్తసంబంధీకులే.. అయినా కూడా బాలయ్య బాబు ఏ నాడు గర్వం చూపించలేదు.. ఫ్యాన్స్ కు అందుబాటులోనే ఉన్నారు..
కోపం వస్తే అదే ఫ్యాన్స్ ను కొట్టాడు.. ప్రేమ వస్తే అదే ఫ్యాన్స్ ను హత్తుకున్నాడు.. అందరిల మీడియా కోసం షో ఆఫ్ కోసం పాకులాడలేదు..
గెటప్పులు, హెయిర్ స్టైలింగ్సు, డైలాగులు, టైటిల్సు. దేనిలో లేదు వెరైటీ.. బాలయ్య బాబు అంటేనే వెరైటీ..
పాట పాడిన బాలయ్య బాబే.. తొడ కొట్టి ట్రైన్ను ఆపేసిన బాలయ్య బాబే.. ఏం చేసిన బాలయ్య బాబు మాత్రమే చేయగలడు..
ఇంకా చెప్పాలి అంటే ఒక నటుడు ఏం చెయ్యాలి అనుకుంటాడో చేయలేక ఆగి పొయ్యి ఉంటాడో అవి అన్ని బాలయ్య బాబు చేసేసాడు అనే చెప్పాలి..
బాలయ్య బాబు ఇలానే అయన వైవిధ్య నటనతో ఇంకా ఎన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆశిస్తున్నాము..