రీజినల్ సినిమా సత్తా చాటిన రాజమౌళి కి బర్త్డే స్పెషల్

దర్శకుడు రాజమౌళి తీసిన మొదటి సినిమా స్టూడెంట్ నో . 1 నుంచి ఇప్పటి వరకు ఒక ప్లాప్ కూడా చూడని దర్శకుడు రాజమౌళి.. తాను తీసే ప్రతి ఫ్రేమ్ లోను క్వాలిటీ తో పాటు కమర్షియల్ యాంగిల్ ను దృష్టి లో పెట్టుకొని తెరకుఎక్కిస్తాడు..
2 ఏళ్ళు కష్టపడి తీసిన బాహుబలి ని ప్లాప్ అవ్వాలని కోరుకున్న జనల ముక్కున వేలు వేసుకునేలా చేసాడు.. బాహుబలి మొదటి భాగం తోనే రెండో భాగం కి కావాల్సినంత క్రేజ్ , డబ్బులు సంపాదించి పెట్టాడు జక్కన్న..
“బాహుబలి ని కట్టప్ప ఎందుకు చంపాడు ” ? , ఒక్క ప్రశ్న తో తనరెండో భాగం కు కావాల్సినంత పబ్లిసిటీ.. అది రాజమౌళి లోని కమర్షియల్ సైడ్.. యమదొంగ లో 20 నిముషాలు నిడివి తో పౌరాణికం మొదలు పెట్టి , మగధీర సినిమా లో మరో జన్మ కాన్సెప్ట్ తో మరో 30 నిమిషాల నిడివి ని రాజ్యాలు రాజ్యాలు చుట్టూ తిప్పిన రాజమౌళి.. పౌరాణికాలు సరిపడా ఎక్స్పీరియన్స్ రాగానే బాహుబలి అంటూ ఒక బారి బడ్జెట్ సినిమాను తెరకు ఎక్కించాడు.. ఇప్పుడు కూడా తన మీద తనకు అలానే నిర్మాతలకు ఎంత నమ్మకం లేక పోతే 450 కోట్లు పెట్టి RRR సినిమా తీయడానికి పూనుకుంటాడు..
రీజినల్ సినిమా అంటే చిన్న చూపు. కానీ బాహుబలి తో అది మారిపోయింది.. దేశ దేశాలు తెలుగు సినిమా కీర్తి రచించాడు రాజమౌళి కేవలం బాహుబలి తో ..
ఈ రోజు పుట్టిన రోజు చేసుకుంటున్న రాజమౌళి ఇలానే ఎన్నో సినిమాలు తీస్తూ తెలుగు సినిమా కీర్తిని పెంచుతూ తాను ఇంకా ఎన్నో పుట్టిన రోజులు చేసుకోవాలని ఆశిస్తుంది సినీ చిట్ చాట్..