మెగా ఫేమ్ ను వాడుకొని మెగా హీరో కు పుట్టిన రోజు స్పెషల్

మెగా ఫేమ్ ను వాడుకొని మెగా హీరో కు పుట్టిన రోజు స్పెషల్


వరుణ్ తేజ్ కొణిదెల ఈ హీరో 2000 లో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన కానీ 2014 లో ముకుంద సినిమా తో హీరో గా పరిచయం అయ్యాడు.. 
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడి కొడుకు.. నాగ బాబు తనయుడు.. పవన్ కళ్యాణ్ అన్న కొడుకు.. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న సినిమా ఇండస్ట్రీ లో మాస్ ఎంట్రీ ఇవ్వలేదు.. క్లాస్ టచ్ తో ముకుంద చేసారు.. వెంటనే 2015 లో క్రిష్ దర్సకతవ్యం లో కంచె సినిమా చేసారు.. యాక్టింగ్ పరంగా మంచి మార్కులు వచ్చిన కానీ కమర్షియల్ గా  హిట్ లేక పోవడం తో మెగా మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ 2015 లోనే లోఫర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. కానీ ఆ సినిమా వరుణ్ తేజ్ దగ్గర నుంచి క్లాస్ ఎక్ష్పెక్త్ చేసే ప్రేక్షకులని బాగా డిసప్పాయింట్ చేసింది.. ఇది అర్ధం చేసుకున్న వరుణ్ తేజ్ 2016 లో గ్యాప్ తీసుకొని 2017 లో మిస్టర్ ఇంకా ఫిదా తో మళ్ళీ క్లాస్ లవ్ స్టోరీస్ తో హిట్ కొట్టి ఫ్యాన్స్ మనసులు సొంతం చేసుకున్నాడు.. 

ఫిదా ఒక మెయిలు రాయి అనే చెప్పాలి వరుణ్ కి.. సాయి పల్లవి ఇంకా శేఖర్ కమ్ముల దర్శకత్వం అన్ని సినిమాకు యాడ్ ఆన్ గా నిలిచాయి.. మొదటి కమర్షియల్ హిట్ అందుకున్న వరుణ్ అక్కడ నుంచి ప్రతి అడుగు ఆచి తూచి వేశారు.. మెగా హీరో అన్న ఇమేజ్ నే తన దారికి రాకుండా జాగ్రత్త పడ్డారు.. క్లాస్ ఆడియన్స్ కూడా తన సినిమాల కోసం వెయిట్ చేసేలే చేసాడు వరుణ్ తేజ్.. 
2018 తొలి ప్రేమ టైటిల్ తో సినిమా వస్తున్నప్పుడు అందరి భయపడ్డారు.. పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమా టైటిల్ తో వస్తున్నాడు.. ఎక్స్ప్ట్రషన్స్ ఎక్కువ ఉంటాయి రీచ్ అవ్వగలడో లేదా అని.. వరుణ్ అందరి డౌట్స్ తీర్చేసాడు.. తన కారియర్ లో రెండవ కమర్షియల్ హిట్ అందుకున్నాడు ఆ సినిమా తో. ఇంకా వెనకకి తిరిగి చూసుకునే అవసరమే రాలేదు వరుణ్ కి..

2018 లో తో అంతరిక్షం 2000 KMPH అంటూ ఇంకో వినూత్న ఎక్స్పరిమెంట్.. సంకల్ప్ రెడ్డి ఈ సినిమాకు దర్శకుడు.. బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా  నిలవలేదు కానీ హిట్ అయితే అందుకున్నాడు వరుణ్.. 2019 లో ఇంకా బ్లాక్ బస్టర్ F2..  2019 చివరిలో ఒక మాస్ మూవీ గడ్డలా కొండా గణేష్ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.. 

తన కారియర్ మొదటి నుంచి ఎక్కడ మెగా క్రేజ్ ను వాడుకోలేదు.. మాస్ ని టార్గెట్ చేయలేదు.. లోఫర్ తో ఎక్స్పరిమెంట్ చేసిన వెంటనే తన పథ స్టైల్ కు వినూత్నంగా ట్రై చేయడం మొదలు పెట్టారు.. పది ఏళ్ళ గ్యాప్ తీసుకున్న కానీ శేఖర్ కమ్ముల ను నమ్మి తనతో సినిమా ఒప్పుకున్నాడు.. అదే వరుణ్ కు బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. 

2020 లో ఫైటర్ గా ఒక బాక్సింగ్ కాన్సెప్ట్ లో రాబోతున్న వరుణ్ తేజ్ కు వినూత్న కథలతో ఇంకా హిట్స్ అందుకోవాలని కోరుకుంటూ సినీ చిట్ చాట్ పుట్టిన రోజు శుభాకాంక్షలు అందిస్తున్నాము.. 

Tags

follow us