హర్భజన్ సింగ్ హీరోగా నటిస్తున్న ‘ఫ్రెండ్ షిప్’

హర్భజన్ సింగ్ హీరోగా నటిస్తున్న ‘ఫ్రెండ్ షిప్’

ప్ర‌ముఖ క్రికెట‌ర్‌ హర్భజన్ సింగ్ హీరోగా నటిస్తున్న  ‘ఫ్రెండ్ షిప్` సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదలై మంచి రెస్పాన్స్ రాబట్టింది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను ట్విట్టర్ లో హర్భజన్ సింగ్ షేర్ చేయగా, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పందిస్తూ, ” ఫ్రెండ్ షిప్ గురించి అయితే తప్పకుండా చూడాల్సిందే, భజ్జీ” అని ట్వీట్ చేశారు. సచిన్ ట్వీట్ ‘ఫ్రెండ్ షిప్` సినిమా మీద అందరిలో మరింత ఆసక్తి పెంచింది.

త‌మిళ  బిగ్ బాస్ ఫేమ్ లోస్లియా మ‌రియ‌నేస‌న్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో  కీలక పాత్రల‌లో యాక్షన్ కింగ్ అర్జున్, త‌మిళ న‌టుడు స‌తీష్‌ న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి జాన్ పాల్ రాజ్‌, శ్యామ్ సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సీన్‌టొ స్టూడియోస్‌, సినీ మాస్ స్టూడియోస్ ప‌తాకాల‌పై జెపిఆర్ & స్టాలిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, త‌మిళ్‌, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేస్తున్నారు.

Tags

follow us