హరిహరవీరమల్లు వచ్చేశాడు..లుక్ అదిరిందిగా.!

HariHaraVeeraMallu confirmed as title for PSPK27 (1)
HariHaraVeeraMallu confirmed as title for PSPK27 (1)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తరవాత డబుల్ స్పీడ్ తో సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. ఇప్పటికే3 పవన్ నటించిన వకీల్ సాబ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాను బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన పింక్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కించారు. ఇదిలా ఉండగానే పవన్ క్రిష్ దర్శకత్వంలోను ఓ సినిమాను పట్టాలెక్కించారు. ఈ సినిమాని ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తున్నారు. ఇక 17వ శతాబ్దం నేపథ్యంలో పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు.

ఇక ఈ చిత్రం టైటిల్ పై అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా శివరాత్రి సందర్భంగా టైటిల్ మరియు ఫస్ట్ గ్లిమ్ప్స్ ను విడుదల చేసారు. సినిమా టైటిల్ ను హరిహరవీరమల్లు గా ప్రకటించారు. అంతే కాకుండా ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ గ్లిమ్ప్స్ కూడా ఆకట్టుకునేలా ఉంది. వీడియోలో పవన్ కళ్యాణ్ గాల్లో ఎగురుతూ విన్యాసాలు చేస్తున్నారు. అంతే కాకుండా కత్తి పట్టుకొని యోధుడుగా కనిపిస్తున్నారు.