ఎవరు ఈ జార్జ్ రెడ్డి : ఎందుకు అందరూ మాట్లాడుతున్నారు

  • Written By: Last Updated:
ఎవరు ఈ జార్జ్ రెడ్డి : ఎందుకు అందరూ మాట్లాడుతున్నారు


జార్జ్ రెడ్డి , తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు ఇదే సినీ ప్రియులు మాట్లాడుకునే విషయం.. రేపు విడుదల అవ్వుతున్న ఈ సినిమా ఒక విప్లవ కారుడి బయోపిక్.. ఆయన పేరు చెప్తే ఇప్పటికి కూడా ఒక శక్తీ విప్లవకారులకు.. ఆయన చనిపోయాయి కొన్ని సంవత్సరాలు గడిచిన కానీ ఉస్మానియా లో ఆయన పేరు తెలియని విద్యార్థి ఉండడు . 1947 జనవరి 15  పుట్టిన ఆయన పాతిక  సంవత్సరా లకే చనిపోయారు , అంటే ఏప్రిల్ 14 1972 లో.. ఉస్మానియా క్యాంపస్ లో చంపేశారు.. 

పుట్టింది కేరళ లో అయినా చివరకి ప్రాణం విడిచింది మాత్రం హైదరాబాద్ లో..

జార్జ్ రెడ్డి విద్య బ్యాసం :

జార్జ్ రెడ్డి విద్యాభ్యాసం బెంగుళూరు,  చెన్నై ఆ తరువాత కాజీపేటలో సాగింది.  తరువాత ఆయన కుటుంబం హైదరాబాదుకు మారింది. అక్కడ సెయింట్ పాల్స్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పూర్తిచేశాడు. నిజాం కళాశాలలో పీ.యూ.సీ పూర్తి చేశాడు. 1964లో బీ.ఎస్సీ చేయటానికి ఉస్మానియా విశ్వవిద్యాలయపు సైన్సు కళాశాలలో చేరాడు. నిజాం కళాశాలలో బియస్సీ  డిగ్రీ చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఫిజిక్స్ లో ఏం.ఎస్సీ చేశారు.. 

కాలేజీ లో ఆయనని చంపేసిన ఇప్పటికి ఎవరు చంపేరో తెలియదు.. RSS వాళ్ళకి సంబంధం లేదు అని కోర్ట్ కేసు కొట్టేసింది.. కంటి ముందు అన్యాయం జరుగుతుంటే చూసి ఎదురు తిరిగే మనస్తత్వం , అదే ఆయనని హీరో ని చేసింది ఆ కలం లో..ఈయన ఒక గోల్డ్ మెడల్ కూడా వచ్చింది.. చిగో వేరే వీర అభిమాని.. అయన సిద్ధాంతాలను ఫాలో అయ్యేవాడు.. ఎది ఎం అయినా ఒక విప్లవకారుడు .. అయన అపోజిషన్ వాళ్ళకి  ఇచ్చే ఒత్తిడిని ఆయనకి వస్తున్న ఫాలోయింగ్ ని ఓర్వలేక నడిచి వచ్చే ఒక విప్లవ సింహాన్ని చంపేశారు.. ఇది మన ముందుకి సినిమాగా వస్తుంది ఇప్పుడు.. 

దశాబ్దాలు కింద క్యాంపస్ రాజకీయాలు, కాలేజీ లో జరిగే గొడవలు బయటకి తెచ్చిన హీరో,ఆయనని అప్పటిలో హైదరాబాద్ చిగువేరా గ పిలిచేవారు అంట.. అయన మీటింగ్ అంటే ఇంకా విద్యార్థులు అందరూ కళ్ళు అర్ప కుండా చూసే వాళ్ళు.. ఈయన మొదట కాంగ్రేస్ పార్టీలోని యంగ్ టర్క్‌లను అనుసరించాడు , కాంగ్రెస్ లో చేరారు… కానీ ఆయనకి రాజకీయాలు అంత అంట లేదు, దీనితో రాజకీయాలకి కొంచం దూరం గానే ఉన్నారు .. 1972 లో ఎలక్షన్ క్యాంపెయిన్ కి వెళ్లి వచ్చిన ఆయనని 30 మంది కలిసి కత్తులతో క్రూరంగా ఉస్మానియా క్యాంపస్ లోని ఇంజినీరింగ్ కాలేజీ మెట్ల మీద దడి చేసి చంపేశారు.. 

జార్జ్ రెడ్డి స్ఫూర్తి తో మణిరత్నం యువ సినిమా లో సూర్య పాత్రా ని రూపొందించారు.. ఆ పాత్ర లో సూర్య, దానిని తీసింది మణిరత్నం కాబట్టి వచ్చిన క్రేజ్ వేరే.. ఇప్పుడు సినిమా అత్యంతం అదే ఎనర్జీ కొనసాగిస్తూ సినిమా ఎలా తీశారో చూడాలి.. ఆ సినిమా ట్రైలర్ చూసి చిరంజీవి, పవన్ కళ్యాణ్, తమ్మారెడ్డి ఇంకా RGV ఇలా ప్రముఖులు అందరూ వాళ్ళ సపోర్ట్ ని ప్రకటించారు అంటే అది సినిమా తీసిన వాళ్ళ మీద ఉన్న నమ్మకం కాదు.. జార్జ్ రెడ్డి మీద ఉన్న ఇష్టం.. 

follow us

Web Stories