ఆ రెండు సినిమాలే నాకు వచ్చాయి..నిజాలు తెలుసుకుని రాయండి.!

  • Written By: Last Updated:
ఆ రెండు సినిమాలే నాకు వచ్చాయి..నిజాలు తెలుసుకుని రాయండి.!

అక్కినేని మనవడు హీరో సుమంత్ టాలీవుడ్ లోకి ప్రేమ కథ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయినప్పటికీ సినిమాలో సుమంత్ పర్ఫామెన్స్ కు మంచి మార్కులు పడ్డాయి. ఆ తరవాత వచ్చిన సినిమలేవీ సుమంత్ కు సక్సెస్ ఇవ్వకపోగా..మళ్ళీ 2004 లో సత్యం సినోమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇక 2006 లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన గోదావరి సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. సుమంత్ కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాలు ఉన్నప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ హిట్ లు అందుకోవడలో మాత్రం విఫలమయ్యాడు. దాంతో కెరీక్ మొదటి నుండి సంతమతమవుతూనే ఉన్నాడు.

ఇక ఇటీవల సుమంత్ నటించిన కపటదారి సినిమా కూడా నిరాశపర్చింది. ఇదిలా ఉండగా సుమంత్ కొన్ని సినిమాలు వధులుకున్నాడని లేదంటే కెరీర్ పీక్స్ ఉండేదని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నే తాజాగా ఓ న్యూస్ పోర్టల్ సుమంత్ నువ్వేకావాలి, మనసంతా నువ్వే, తొలి ప్రేమ, దేశముదురు, ఇడియట్ సినిమాలకు నో చెప్పాడని పేర్కొంది. దాంతో సదరు న్యూస్ పోర్టల్ పై సుమంత్ ఫైర్ అయ్యాడు. “పానీ లేని పూరి నిజాలు తెలుసుకుని రాయండి..నేను వదులుకున్నది దేశ ముదురు, నువ్వే కావాలి మాత్రమేనని చెప్పాడు.

follow us