నన్ను నాకే కొత్తగా చూపించారు త్రివిక్రమ్

అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ నెల 12 మన ముందుకు వస్తుంది , ఈ రోజు మ్యూజిక్ కన్సర్ట్ జరుపుకుంటున్న సందర్భంగా హీరో సుశాంత్ మాట్లాడుతూ – “ఈ సినిమా కోసం నన్ను ఎంపిక చేసిన బన్నీగారికి, త్రివిక్రమ్‌గారికి థ్యాంక్స్. కథ వినకుండానే ఈ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాను. బన్నీతో కలిసి త్రివిక్రమ్‌గారి దర్శకత్వంలో చేయడం చాలా సంతోషాన్నిచ్చింది.
బన్నీ, త్రివిక్రమ్‌గారు, చినబాబుగారు, అల్లు అరవింద్‌గారికి థ్యాంక్స్. నన్ను నాకే కొత్తగా త్రివిక్రమ్‌గారు చూపించారు. నేను ఇలా కూడా చేయవచ్చా అనిపించింది. ఈ సినిమా చేయడం చాలా హెల్ప్ అయ్యింది. ఇలా కంఫర్ట్‌గా ఫీల్ అవుతానని నేను అనుకోలేదు. బన్నీ నాకు ఫ్రెండ్‌గా బాగా తెలుసు. అయినా నా కంఫర్ట్ నాకు ఇచ్చాడు.
టబుగారిని నిన్నే పెళ్ళాడతా సమయంలో ఆమెను సెట్స్‌లో కలుసుకున్నాను. తర్వాత యాక్టింగ్ స్కూల్‌కోసం ముంబై వెళితే.. టబుగారు ఇంట్లో పెట్టుకుని జాగ్రత్తగా చూసుకున్నారు. ఆవిడతో కలిసి ఈ సినిమాకు పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాను.