సీనియ‌ర్ హీరోయిన్ తో బాల‌య్య రొమాన్స్..!

  • Written By: Last Updated:
సీనియ‌ర్ హీరోయిన్ తో బాల‌య్య రొమాన్స్..!

ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో అఖండ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం లో బాలయ్య త్రిపాత్రాభినయంతో నటవిశ్వరూపం చూపించబోతున్నారు. ఇక ఈ సినిమా తరవాత బాలయ్య గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో ఓ సినిమా సెట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మైత్రీమూవీమేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేయబోతున్నారట.

ఒక పాత్రలో పోలీస్ గా మరో పాత్రలో ఫ్యాక్షనిస్ట్ గా బాలయ్య నటించనున్నారట. ఇక ఈ రెండు పాత్రలకు ఇద్దరు హీరోయిన్ లు అవరమే కాబట్టి ఒక పాత్రలో సీనియర్ హీరోయిన్ ను మరో పాత్రలో యంగ్ హీరోయిన్ ను సెట్ చేస్తున్నారట. అంతే కాకుండా ఓ హీరోయిన్ గా శృతి హాసన్ అనుకుంటుండగా…మరో హీరోయిన్ కోసం మీనా ను అనుకుంటున్నారట. ఇక ఇప్పటికే మీనా బాలయ్య తో కలిసి అశ్వమేధం, బొబ్బిలి సింహం, ముద్దుల మొగుడు లాంటి సినిమాలతో అలరించింది. ఇక మరోసారి తెరపైకి వస్తే వీరి కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి.

follow us