భారీగా పెరగనున్న టికెట్ రేట్లు

కరోనా కారణంగ మూవీ థియేటర్స్ కొన్ని నెలలుగా మూత పడటంతో, సినీ కార్మికులు, థియేటర్ కార్మికులు ఉపాధి కొల్పోయారు. వారికి అండగా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది. తెలుగు చిత్రసీమకు కేసిఆర్ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. తాజాగా సిఎం ప్రెస్ మీట్ లో 10 కోట్లు పెట్టి నిర్మించే చిన్న సినిమాలు జిఎస్‌టి చెల్లించనవసరం లేదని, ఇక సినిమా టికెట్ రేట్స్ కూడా థియేటర్ యజమానులకు వదిలేశాడు, అదే విదంగా థియేటర్ బఖాయి కరెంట్ బిల్లు లు కూడా చెల్లించాలిసిన అవసరం లేదు అన్నారు. రోజుకు ఎన్ని షోస్ వేసుకుంటారో అది మీ ఇష్టం, మూవీ డిమాండ్ ను బట్టి టికెట్ రేట్స్ ను పెంచుకునే అధికారం ఇచ్చాడు. ఇకపై థియేటర్ కు వెళ్ళి సినిమా చూడాలి అంటే జేబులు ఖాళీ కావలిసిందే. నిర్మాతలకు లాభం చేకూరే నిర్ణయం అయిన, ప్రేక్షకులు మాత్రం ఇక థియేటర్ కు వచ్చి సినిమా చూసే సాహసం చెయ్యకపోవచ్చు.
మల్టీ ఫ్లెక్స్ లో టికెట్ రేట్స్ 150 నుండి మొదలవ్వుతుంది. కొత్త సినిమా రోజు వాటిని పెంచిన ఆశ్చర్యపోవలిసిన అవసరం లేదు. ఇక సామాన్య థియేటర్స్ లో ఫస్ట్ క్లాస్ టికెట్ 100 పైగా ఉంటుంది. దాన్ని 250 పెట్టి కోనాలంటే మాత్రం ప్రేక్షకులపై అధిక భారం పడినట్లు అవ్వుతుంది. ఇంకా సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ టిక్కెట్స్ కొన్నే ప్రేక్షకుడు దాని జోలికి కూడా పోడు.
నిర్మాతలు మాత్రం 100 శాతం ఆక్యుపెన్సీ తో మాత్రమే పెద్ద సినిమాలు విడుదల చెయ్యాలని భావిస్తున్నారు. కనీసం అందులో 75 శాతం ఆక్యుపెన్సీ ఉంటే బాగుంటుందని పెద్ద సినిమాలు విడుదలైన రెండు మూడు రోజుల్లో డబ్బులు వసూళ్లు అవ్వుతాయని భావిస్తున్నారు. ఇప్ప్దు ఇచ్చిన 50 శాతం ఆక్యుపెన్సీ తో చిన్న సినిమాలు విడుదల చెయ్యాలన్న, ఏ సినిమా కూడా సిద్దం గా లేదు. రోజుకు 6 నుండి 7 షో లు నడిచిన 50 శాతం ఆక్యుపెన్సీ కవర్ చెయ్యవచ్చు అని ప్రభుత్వం భావిస్తుంది. కరోనా కారణంగ ప్రేక్షకులు థియేటర్స్ కు రారు. కొద్ది మంది ప్రేక్షకులతో షోస్ పెంచుకుంటూ పోయిన ఖర్చు వస్తుంది తప్పా లాభం రాదు అనే అబిప్రాయంలో నిర్మాతలు ఉన్నారు కావున 75 ఆక్యుపెన్సీ ఇస్తే తప్పా పెద్ద సినిమాలు విడుదల కావు. నిర్మాత మండలి కూడా కోరేది ఒక్కటే కనీసం 75 శాతం ఆక్యుపెన్సీ ఇస్తే బాగుంటుంది అంటున్నారు.