వీకెండ్ లో అదరగొట్టిన హిట్ 2

వీకెండ్ లో అదరగొట్టిన హిట్ 2

హిట్ 2 మూవీ వీకెండ్ లో అదరగొట్టింది. వాల్ పోస్టర్ బ్యానర్ ఫై నాని నిర్మించిన మూవీ హిట్ 2 . అడవి శేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 02 న ప్రేక్షకుల ముందుకు వచ్చి చక్కటి విజయాన్ని అందుకుంది. హిట్ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీ ..ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని , సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.

సినిమా కు హిట్ టాక్ రావడం తో ప్రేక్షకులు బ్రహ్మ రధం పడుతున్నారు. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఆదివారం కలెక్షన్స్ చూస్తే..నైజాంలో 1.44 కోట్లు, సీడెడ్ లో 41 లక్షలు, ఉత్తరాంధ్రలో 46 లక్షలు, ఈస్ట్ లో 21 లక్షలు, గుంటూరులో 19 లక్షలు , కృష్ణాలో 21 లక్షలు, నెల్లూరులో 14 లక్షలతో రూ. 3.25 కోట్ల షేర్, రూ. 5.20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే ఈ సినిమా మూడు రోజుల్లో 14.91 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక 26.20 కోట్ల గ్రాస్ దక్కింది.

follow us