రివ్యూ: హిట్ – పక్కా థ్రిల్లర్

HIT Movie Review
HIT Movie Review

మూడేళ్ళ క్రిందట నాని అ అనే ఒక అక్షరం పేరుతో సినిమా తీసి మంచి హిట్ కొట్టడమే కాకుండా, అవార్డులు కూడా పొందారు. ఇప్పుడు నాని నిర్మాతగా ఫలక్ నామా దాస్ హీరో విశ్వక్ సేన్ హీరోగా సినిమా చేశారు. ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది. క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.

కథ:

విశ్వక్ సేన్ ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆఫీసర్. చిన్న తనం నుంచి తన జీవితంలో జరిగిన అనేక విషయాల కారణంగా ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా రియాక్ట్ అవుతుంటారు. చిన్న మంట చూసినా, ఏదైనా క్రైం చూసినా అలానే రియాక్ట్ అవుతుంటారు. ఇలా రియాక్ట్ అయ్యే ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ముందుకు ఓ కేసు వస్తుంది. సాహితి అనే అమ్మాయి రింగ్ రోడ్ నుంచి మిస్ అవుతుంది. ఆమె ఏమైందో తెలుసుకునే సమయంలో విశ్వక్ సేన్ ప్రేయసి రుహాని శర్మ కూడా మిస్ అవుతుంది. సాహితికి రుహానికి ఏమైనా సంబంధం ఉన్నదా…? ఎవరు వాళ్ళను కిడ్నాప్ చేశారు? విశ్వక్ సేన్ ఆ రెండు కేసులను ఎలా హ్యాండిల్ చేశారు అన్నది కథ.

విశ్లేషణ:

చిన్న పాయింట్ చుట్టూ కథనాలు అల్లుకోవడం దానికి తగినంత సస్పెన్స్ ను జోడించి సినిమాగా తీయడం అంటే మాములు విషయం కాదు. స్క్రీన్ ప్లేలో ఏమాత్రం పట్టు తప్పినా సినిమా మొత్తం తలక్రిందులౌతుంది. పగడ్బందీగా ప్లాన్ చేసుకోవాలి. హిట్ సినిమాలో దర్శకుడు అలానే ప్లాన్ చేశారు. థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లేను రాసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. రాసుకున్న దాని ప్రకారం తెరపై ప్రజెంట్ చేయడంలో కూడా సక్సెస్ సాధించాడని చెప్పొచ్చు.

చిన్న కేసుతో ప్రారంభమైన కథ మలుపులు తిరుగుతూ ఏదైతే మెయిన్ పాయింట్ అనుకుంటారో ఆ పాయింట్ దగ్గరకి వెళ్తుంది. అక్కడి నుంచి నడిపించిన కథనం సినిమాకు ప్లస్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ లో ఒక చిన్న కేసుతో సినిమా ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి మెల్లిగా సాగిన కథ, సెకండ్ హాఫ్ వరకు వచ్చే సరికి స్పీడ్ అందుకుంటుంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ లో కథనాలు సస్పెన్స్ గా ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాడు దర్శకుడు. సినిమా మొత్తం సీరియస్ గా సాగుతుంది. ఎక్కడా కూడా రెగ్యులర్ ఫార్మాట్ లో ఉన్నట్టుగా కనిపించదు. కమర్షియల్ హంగులు ఉండవు. కామెడీ కనిపించదు. సీరియస్ గా సాగే సినిమాలు కొందరికే నచ్చుతాయి. థ్రిల్లింగ్ సినిమాలు చూసే వాళ్లకు ఈ సినిమా నచ్చుతుంది.

నటీనటుల పనితీరు:

హీరో విశ్వక్ సేన్ అన్ని తానై సినిమాను నడిపించారు. సినిమా ఓపెనింగ్ సీన్ నుంచి క్లైమాక్స్ వరకు కూడా అదే సీరియస్ ను మెయింటైన్ చేస్తూ కథను నడిపించారు. హీరోయిన్ రుహాని శర్మ తన పరిధిమేరకు మెప్పించింది.

సాంకేతికవర్గం పనితీరు:

సాంకేతిక వర్గం గురించి చెప్పుకోవాలి అంటే మొదటగా చెప్పుకోవాల్సింది దర్శకుడి గురించే. దర్శకుడు శైలేష్ కొలను సినిమాను తీసిన విధానం ప్రతి ఒక్కరిని మెప్పిస్తుంది. కొత్తవాడు అయినప్పటికీ కూడా కథను నడిపిన విధానం సూపర్. సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

పాజిటివ్ పాయింట్స్:

విశ్వక్ సేన్

కథనం

దర్శకత్వం

నెగెటివ్ పాయింట్స్:

అక్కడక్కడా ల్యాగ్..

చివరిగా: హిట్: పక్కా థ్రిల్లర్

రేటింగ్: 2.75/5