వాల్తేర్ వీరయ్య లో రవితేజ ఎంత సేపు కనిపిస్తాడంటే..!

వాల్తేర్ వీరయ్య లో రవితేజ ఎంత సేపు కనిపిస్తాడంటే..!

మెగాస్టార్ చిరంజీవి – బాబీ కలయిక తెరకెక్కిన వాల్తేర్ వీరయ్య ..జనవరి 13 న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ లో మాస్ రాజా రవితేజ ఓ కీలక రోల్ లో నటిస్తుండడం తో సినిమా ఫై మరింత అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా రవితేజ తాలూకా ప్రోమో సైతం అభిమానులు విపరీతముగా ఆకట్టుకుంది. అయితే సినిమాలో రవితేజ పాత్ర నిడివి ఎంత ఉంటుందనేదానిపై అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు సినిమాలో రవితేజ 42 నుంచి 44 నిమిషాల పాటు స్క్రీన్ మీద కనిపిస్తారని తెలుస్తుంది.

అది కూడా మేజర్ సీన్స్ అన్నీ చిరంజీవి కాంబినేషన్ లోనే ఉంటాయని , ఇద్దరి కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు అభిమానుల్లో ‘పూనకాలు’ పుట్టిస్తాయని అంటున్నారు. అంతే కాదు ఇద్దరి కాంబో లో వచ్చే సాంగ్ కూడా థియేటర్స్ లలో ఈలలు వేయిస్తుందని అంటున్నారు. ఇక త్వరలోనే ఈ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫైనల్ కట్ వర్క్ జరిగిపోయింది. రెండు గంటల 35 నిమిషాల నిడివి వచ్చినట్లు తెలుస్తోంది.

follow us