కలెక్షన్ కింగ్ కు షాక్ ఇచ్చిన జీహెచ్ఎమ్సీ.!

hyderabad-ghmc-fines-actor-mohan-babu-rs-1-lakh-fine-for-illegal-advertisement
hyderabad-ghmc-fines-actor-mohan-babu-rs-1-lakh-fine-for-illegal-advertisement

కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. మోహన్ బాబు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం ముందు 15 అడుగుల ఎల్ఈడీ లైటింగ్ తో ఒక బోర్డింగ్ ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ బోర్డింగే ఆయనకు షాక్ తగిలేలా చేసింది. ఆయన ఇంటిముందు ఏర్పాటు చేసిన ఈ బోర్డింగ్ కోసం ఆయన మున్సిపల్ అధికారుల వద్ద ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. దాంతో అక్రమంగా ఏర్పాటు చేసినందుకు ఆయనకు నోటీసులు పంపించారు. ఏకంగా లక్ష రూపాయలు కట్టాలని నోటీసులో పేర్కొన్నారు.

ఇక కలెక్షన్ కింగ్ కు ఫైన్ విధించడం ఆయన అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.అయితే ఇదివరకే అనేక సంధర్భాల్లో జీహెచ్ఎంసి అధికారులు పలువురు ప్రముఖులకు సెలబ్రెటీలకు అనుమతులు లేకుండా బోర్డింగ్ లు ఏర్పాటు చేసినందుకు ఫైన్ లు వేశారు. ఇదిలా ఉండగా మోహన్ బాబు దేశ భక్తి నేపథ్యంలో తెరకెక్కుతున్న సన్నాఫ్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కు రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు.