సద్దాం హుస్సేన్ తో గొడవలు ఉన్నట్లు తెలిపిన హైపర్ ఆది

సద్దాం హుస్సేన్ తో గొడవలు ఉన్నట్లు తెలిపిన హైపర్ ఆది

హైపర్ ఆది..అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు. జబర్దస్త్ షో ద్వారా పరిచమైన ఆది..అతి తక్కువ టైంలోనే టాప్ స్టార్ గా ఎదిగారు. తనదైన పంచులతో బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ఆది..ఆ తర్వాత వెండితెరపైకి కూడా ఎంట్రీ ఇచ్చి అలరిస్తూ వస్తున్నాడు. నటుడిగానే కాక రచయితగా కూడా ఆకట్టుకున్నాడు. రవితేజ నటించిన ధమాకా చిత్రానికి హైపర్ అదినే కామెడీ స్కిట్ లు రాయడం జరిగింది. ఈ స్కిట్లు థియేటర్స్ లలో నవ్వులు పోయించాయి.

ఇదిలా ఉంటె గత కొంతకాలంగా కమెడియన్ సద్దాం హుస్సేన్ తో హైపర్ ఆదికి గొడవలు నడుస్తున్నాయని ప్రచారం జరుగుతూ వస్తుంది. ఇది ఇప్పుడు నిజమే అన్నట్లు అదినే తెలిపాడు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఓ ఛానెల్ క్యాష్ వేర్ ఈజ్ ది పార్టీ పేరుతో ఒక స్పెషల్ ప్రోగ్రామ్ నిర్వహించనున్నారు. ఇందులో బుల్లితెర కమెడియన్స్ తోపాటు పలు టీవీ సీరియల్స్ నటీనటులు కూడా పాల్గొన్నారు. తాజాగా ఈ ప్రోగ్రామ్ కి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో నరేష్, హైపర్ ఆది, అటో రామ్ ప్రసాద్ తమదైన కామెడీ నవ్వులు పూయించారు. సీరియల్స్ యాక్టర్స్ డ్యాన్స్ పర్ఫామెన్స్ లతో ఆకట్టుకున్నారు.

ప్రోమో చివర్లో.. 2022లో నాకు సద్దాం హుస్సేన్ గాడికి చిన్న చిన్న మనస్పర్థలు వచ్చాయి. అవి ఈ 2023 సంవత్సరంలో పూర్తిగా పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని హైపర్ ఆది చెబుతూ కేక్ ను సద్దాం హుస్సేన్ కు తినిపించాడు. తర్వాత హైపర్ ఆదికి సద్దాం కేక్ తినిపించాడు. అయితే వాళ్లిద్దరి మధ్య వచ్చిన గొడవలు ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఆ విషయాన్ని బయట పెట్టి హైపర్ ఆది షాక్ ఇచ్చాడు. అసలు ఏమైందో తెలియాలంటే డిసెంబర్ 31న రాత్రి 9:30 గంటలకు ప్రసారమయ్యే ఈ ప్రోగ్రాం చూడాల్సిందే.

follow us