హరి హర వీరమల్లుకు హైపర్ ఆది మాట సాయం

జబర్దస్త్ ఫేమ్..పవన్ కళ్యాణ్ వీరాభిమాని హైపర్ ఆది..హరిహర వీరమల్లు కు మాట సాయం అందిస్తున్నట్లు సమాచారం. హైపర్ ఆది..అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు. జబర్దస్త్ షో ద్వారా పరిచమైన ఆది..అతి తక్కువ టైంలోనే టాప్ స్టార్ గా ఎదిగారు. తనదైన పంచులతో బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ఆది..ఆ తర్వాత వెండితెరపైకి కూడా ఎంట్రీ ఇచ్చి అలరిస్తూ వస్తున్నాడు. నటుడిగానే కాక రచయితగా కూడా ఆకట్టుకున్నాడు. రవితేజ నటించిన ధమాకా చిత్రానికి హైపర్ అదినే కామెడీ స్కిట్ లు రాయడం జరిగింది. అంతకు ముందు అల్లరినరేష్ హీరోగా నటించిన మేడ మీద అబ్బాయి చిత్రానికి కూడా ఆది మాటలు రాసారు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రానికి రచయితగా పని చేస్తున్నాడట. అయితే ఆయన పూర్తి స్థాయిలో కాదు. కేవలం కామెడీ ఎపిసోడ్స్ కి హైపర్ ఆది డైలాగ్స్ రాస్తున్నారట.
వాస్తవానికి పవన్ కళ్యాణ్ అంటే హైపర్ ఆది కి ఎంతో ఇష్టం, అభిమానం. జనసేన పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. 2019 ఎన్నికల్లోనూ జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అంతే కాదు పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాలోనూ నటించాడు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ మూవీ కి పనిచేసే ఛాన్స్ కొట్టేసాడు. టైమింగ్ కామెడీ పంచ్లకు హైపర్ ఆది పెట్టింది పేరు. మనోడి స్కిట్స్ చూస్తే ఆ విషయం అర్థం అవుతుంది. హైపర్ ఆది స్కిట్స్ లో నాన్ స్టాప్ కామెడీ పంచెస్ నవ్వులు పూయిస్తాయి. ఈ క్రమంలో హరి హర వీరమల్లు కామెడీ సన్నివేశాలకు అతడి సాయం తీసుకుంటే బెటర్ ని మేకర్స్ భావించారట. దర్శకుడు క్రిష్… హరి హర వీరమల్లు కామెడీ ఎపిసోడ్స్ కి హైపర్ ఆది చేత డైలాగ్స్ రాయించారని సమాచారం. ఇక ఈ మూవీ కి పూర్తి స్థాయి రచయితగా సాయిమాధవ్ బుర్రా పని చేస్తున్నారు. ఈ మధ్య భారీ ప్రాజెక్ట్స్ కి ఆయనే రచయితగా పని చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి సైతం మాటలు అందించింది ఆయనే. ఇక కొన్నాళ్లుగా క్రిష్ చిత్రాలకు సాయి మాధవ్ బుర్రానే రచయితగా వ్యవహరిస్తున్నారు. హరిహర వీరమల్లు కు కూడా ఆయనే పనిచేస్తున్నారు. జస్ట్ కామెడీ సన్నివేశాలకు మాతర్మే ఆది వర్క్ చేస్తున్నాడు.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఫిబ్రవరి లో సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అవుతుందని మేకర్స్ చెపుతున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా హరి హర వీరమల్లు తెరకెక్కుతుంది. నిర్మాత ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మొఘలుల కాలం నాటి బందిపోటు వీరుడి కథగా హరి హర వీరమల్లు రూపొందుతుంది. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.