జగనన్న స్వర్ణోత్సవ సంబరాల్లో హైపర్ ఆది సందడి

జగనన్న స్వర్ణోత్సవ సంబరాల్లో హైపర్ ఆది సందడి

జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆదికి పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో చెప్పాల్సిన పనిలేదు. జనసేన పార్టీ ప్రచారం లో , పార్టీ కార్య క్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. పవన్ కళ్యాణ్ అంటే తన ప్రాణమని..ఆయనకోసం ఏమైనా చేయడానికి సిద్ధమని ఎన్నో సార్లు మీడియా ముందు చెప్పడం జరిగింది. అలాంటి హైపర్ ఆది జగనన్న స్వర్ణోత్సవ సంబరాల్లో పాల్గొనడం చర్చ గా మారింది. అయితే ఈ సంబరాల్లో పాల్గొనడానికి కారణం మంత్రి రోజా అని క్లారిటీ ఇచ్చారు ఆది.

మంత్రి రోజా గతంలో జబర్దస్ కార్యక్రమంలో జడ్జిగా ఉన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ కార్యక్రమానికి దూరమయ్యారు. జబర్దస్త్ నటులతో పరిచయం ఉండటంతో.. వారిని జగనన్న స్వర్ణోత్సవ సంబరాలకు మంత్రి రోజా ఆహ్వానించారు. కళకారులుగా ఎవరు ఆహ్వానించినా సరే నటులు వెళుతుంటారు. దీన్ని కూడా రాజకీయంగా భావించడం సరికాదనే అది చెప్పకనే చెప్పారు. మంత్రి రోజా ఆహ్వానించడంతో ఈ కార్యక్రమానికి వచ్చామన్నారు. రోజా కూడా జబర్దస్‌లో తమను ఎంతో ప్రొత్సహించారని.. చాలా రోజుల తర్వాత మంత్రి సమక్షంలో కార్యక్రమం చేశామన్నారు. నటుడు అలీ కూడా తమకు ఇన్స్పిరేషన్ అన్నారు.. ఆయన సమక్షంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఈ సంబరాల్లో ఆది తో పాటు జబర్దస్త్ నటులు , అలీ, అనసూయలు హాజరయ్యారు.

follow us