చరణ్ జీబ్రా షర్ట్ ధర తెలిస్తే గుండెలు బాదుకుంటారు

చరణ్ జీబ్రా షర్ట్ ధర తెలిస్తే గుండెలు బాదుకుంటారు

సినీ తారలు సినిమాల్లోనే కాదు బయట కూడా చాల కాస్ట్లీగా కనిపిస్తారు. వారు వాడే ప్రతి వస్తువు చాల రిచ్ గా ఉండేలా చూసుకుంటారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వేసుకున్న జీబ్రా షర్ట్ ధర ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. తాజాగా చరణ్ చారల డిజైన్ (జీబ్రా లుక్) తో రూపొందించిన షర్ట్ తో దర్శనం ఇచ్చాడు. బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తో ఎంతో అందంగా డిజైన్ చేసిన ఈ షర్ట్ ని చూశాక దాని ఖరీదును కూడా తెలుసుకోవాలని అభిమానులు తహతహలాడుతున్నారు.

కాగా చరణ్ వేసుకున్న ఈ జీబ్రా ప్రింట్ షర్ట్ ఖరీదు అక్షరాలా రూ.2లక్షలు అని తెలిసింది. ఈ షర్ట్ ఖరీదు ఎగ్జాక్ట్ గా ఎంత ఉంటుంది? అన్నది ఆరా తీస్తే… ఆన్ లైన్ సమాచారం మేరకు… రూ. 173326 (1.7లక్షలు) విలువైన డోల్స్ అండ్ గబ్బానా జీబ్రా ప్రింట్ షర్ట్ ఇదని బ్రాండ్ గురించి తెలిసింది. ఈ ధర చూసి అభిమానులు , నెటిజన్లు గుండెలు బాదుకుంటున్నారు. ప్రస్తుతం చరణ్ శంకర్ డైరెక్షన్లో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు.

follow us

Related News