జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కు అస్వ‌స్థ‌త‌..!

illness to pawan kalyan
illness to pawan kalyan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల పవన్ వ్యక్తిగత సిబ్బంది కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. దాంతో పవన్ కళ్యాణ్ హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్లారు. అయితే అప్పటి నుండి పవన్ ఆరోగ్యం ఎటువంటి సమాచారం లేదు. అయినప్పటికీ ఆయన తిరుపతి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. అయితే తాజాగా పవన్ కు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ రావడం తో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కు కరోనా సోకిందేమో అనే అనుమానం తో పరీక్షలు నిర్వహిస్తున్నారు.

పవన్ కు కొద్ది పాటి ఇన్ఫెక్షన్ మాత్రమే ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇక పవన్ రాజకీయాలకకే కాకుండా సినిమా షూటింగ్ లకు కూడా ప్రస్తుతం దూరంగా ఉన్నారు. పవన్ ఆరోగ్యం పై పూర్తి సమాచారం రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా పవన్ కల్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా మంచి విజయం సాధించింది. అంతే కాకుండా ప్రస్తుతం పవన్ మలయాళ సినిమా అయ్యప్పనుమ్ కొషియం రీమేక్ లో నటిస్తున్నారు. అంతే కాకుండా క్రిష్ దర్శకత్వంలో “హరిహారవీరమల్లు” సినిమాలో నటిస్తున్నారు.