సావిత్రి పోస్టల్ స్టాంప్ మీరు ఎప్పుడైనా చూసారా ?

సావిత్రి పోస్టల్ స్టాంప్ మీరు ఎప్పుడైనా చూసారా ?

భారత చలన చిత్ర పరిశ్రమ లో ఆనాడు ఎంతో మంది తారలు ఓ వెలుగు వెలిగారు. అందులో ఓ దృవ తార మహానటి సావిత్రి మన తెలుగు అమ్మాయి అని చెప్పుకోవడానికి గర్వపడే అంతగా పేరు సంపాదించుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో చిర్రావూరు అనే గ్రామంలో జన్మించింది. మొదట రంగస్థలం పై ఎన్నో ప్రదర్శనలు ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో సంసారం అనే చిత్రంతో సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత పెళ్లి చేసి చూడు, పాతాలబైరవి వంటి సినిమాలు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.

సావిత్రిగా అంచలు అంచలుగా ఎదుగుతూ మహానటి సావిత్రి అనే స్థాయికి చేరుకుంది. ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఆమె సినీ పరిశ్రమ కు చెందిన ఎంతో మందికి ఆమె సాయం చేసింది. తమిళ నటుడు జెమిని గణేశన్ ను పెళ్లి చేసుకుంది. కొంతకాలం వరకు హ్యాపీగానే ఉన్నారు. కానీ ఆ తర్వాత ఆమె బందువులు ఆమె అస్థిపై కన్ను వేశారు. సావిత్రి చివరి రోజుల్లో ఎవరు కూడా ఆమెను దగ్గరకు తియలేదు. అలా ఆ మహానటి సావిత్రి జీవితం ముగిసిపోయింది. 2011 లో ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ మహానటి సావిత్రి పేరు మీద పోస్టల్ స్టాంప్ ను విడుదల చేసింది. ఆ తరానికి చెందిన కొంతమంది నటీమణుల పేరుతో కూడా అదే సమయంలో పోస్టల్ స్టాంప్స్ ను విడుదల చేశారు. నిన్న (డిసెంబర్ 6) ఆమె జయంతి ఈ సందర్భం గా ఆమెను ఓ సారి గుర్తు చేసుకుందాం.

follow us

Related News