ఫైటర్ పై పూరీ భవిష్యత్తు !

  • Written By: Last Updated:
ఫైటర్ పై పూరీ భవిష్యత్తు !

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ హీరో రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమా తీసి మరల ఫామ్ లోకి వచ్చాడు. ఆ మధ్య వరస ఫ్లాప్స్ తో వచ్చిన పూరీకి ఆ చిత్రం మంచి బూస్టింగ్ ఇచ్చింది. తాజాగా ఆయన అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ తో ఫైటర్ అనే మూవీని చిత్రీకరిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. మొదట ఈ చిత్రం యొక్క షూటింగ్ ముంబై పరిసర ప్రాంతాల్లో జరుపుకుంది. యాక్షన్ అండ్ లవ్ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. తెలుగు తో పాటు గా హింది లో ఈ చిత్రం విడుదలచెయ్యనున్నారు. ఈ చిత్రాన్ని నటి కమ్ నిర్మాత ఛార్మి, కరణ్ జోహర్ నిర్మిస్తున్నారు.

కరోనా కారణం గా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విదించడంతో ఫైటర్ మూవీ షూటింగ్ ను పూరీ పోస్ట్ పోన్ చేశాడు. గతంలో నందమూరి బాలకృష్ణ తో పైసా వసూల్ అనే చిత్రం తీసి మంచి హిట్ ను అందించాడు. ఆ సమయంలోనే మరల బాలయ్య బాబు గారితో మరో సినిమా తప్పకుండ చేస్తానన్ని చెప్పాడు. అలాగే మహేశ్ బాబుకి బిజినెస్ మాన్ అనే సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన పూరీ మరల ఆయనతో ఓ సినిమా చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి తో “ఆటోజాని” అనే చిత్రం ను తీస్తానన్ని పలు ఇంటర్వ్యూ లో చెప్పాడు. అందుకు సంబందించిన స్క్రిప్ట్ వర్క్ పై దృష్టి పెట్టినట్లు చెప్పుకొచ్చాడు. ఇక వరస ఫ్లాప్స్ వస్తున్న సమయంలో హీరో రామ్ నన్ను నమ్మి ఇస్మార్ట్ శంకర్ లో నటించినందుకు.. కచ్చితంగా రామ్ తో మరో సినిమా ఉంటుందని చెప్పాడు.

బాలకృష్ణ , మహేష్ బాబు , చిరంజీవి , రామ్ మరి కొంత మంది చిన్నహీరోలకోసం ఈ లాక్ డౌన్ సమయంలో పురిజగన్నాథ్ ఓ అరడజన్ స్క్రిప్త్స్ పైగా రాసినట్లు సినీ వర్గ కథనాలు మరి విజయ్ దేవరకొండ తో తీస్తున్న ఫైటర్ మూవీ టాక్ కొంచెం అటు ఇటు అయితే ఆయన రెడీ చేసుకున్నా స్క్రిప్త్స్ పై సినిమా చెయ్యడానికి ఏ హీరో అయిన ముందుకు వస్తారా. హిట్ సినిమాలు తీసిన దర్శకుల వెంట పడుతున్న మన హీరోలు.. ఈ మధ్య ఒక్క హిట్ తో ట్రాక్ లోకి వచ్చిన పూరీని నమ్ముతారా.. పూరీ భవిష్యత్తు మొత్తం ఫైటర్ సినిమా పై ఆదారపడి ఉంది.

follow us