హీరో రానా కు సారీ చెప్పిన ఇండిగో ఎయిర్ లైన్స్

హీరో రానా కు సారీ చెప్పిన ఇండిగో ఎయిర్ లైన్స్

హీరో రానా కు ఇండిగో ఎయిర్ లైన్స్ సారీ చెప్పింది. తన లగేజ్ మిస్ అవ్వడం పట్ల ఇండిగో ఎయిర్ లైన్స్ ఫై రానా ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి రానా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చారు. విమానాశ్రయంలో చెక్‌ ఇన్‌ అయ్యాక బెంగళూరు సర్వీసు ఆలస్యమవుతుంది, మరో విమానంలో వెళ్లాల్సిందిగా సిబ్బంది సూచించారు. లగేజ్‌ కూడా అదే విమానంలో పంపిస్తామని చెప్పారు. వారు చెప్పినట్టే రానా కుటుంబం బెంగళూరు వెళ్లింది. కానీ లగేజ్‌ మాత్రం రాలేదు. ఈ విషయమై విమానాశ్రయ సిబ్బందిని రానా ప్రశ్నించారు. వారి నుంచి సరైన సమాధానం లేకపోవడంతో అక్కడున్న ఉన్నతాధికారులను నిలదీశారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్‌లో ఇండిగో ఎయిర్ లైన్స్ ను టార్గెట్‌ చేసిన రానా… తాము కల్పించే సదుపాయాలు, రక్షణ గురించి ఇటీవల ఆ సంస్థ చేసిన ట్వీట్లను రీ ట్వీట్‌ చేస్తూ పలు వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ‘విమానాలు ఎప్పుడొస్తాయో, ఎప్పుడు వెళతాయో తెలియదు. మిస్సయిన లగేజ్‌ని ఎలా కనుగొనాలో తెలియదు. ఈ విషయాలు సిబ్బందికే తెలియదు’ అంటూ ఫైర్ అయ్యారు.

దీనిపై ఇండిగో ఎయిర్ లైన్స్ రానా కు సారీ చెప్పింది. ‘సర్, మీ లగేజ్‌ మీతో పాటు విమానంలో రాకపోవడం వల్ల కలిగిన అసౌకర్యాన్ని మేము అర్థం చేసుకున్నాం. మీకు కలిగిన అసౌకర్యానికి మేము క్షమాపణలు కోరుతున్నాం. మీ లగేజ్ మీకు వీలైనంత త్వరగా అందిస్తామని హామీ ఇస్తున్నాం. ఇందుకోసం మా బృందం పని చేస్తోంది’ అంటూ ఇండిగో సంస్థ ట్వీట్‌ చేసింది.

follow us