పూజా హగ్దే కు మళ్లీ ఐరెన్ లెగ్ ట్యాగ్..?

పూజా హగ్దే కు మళ్లీ ఐరెన్ లెగ్ ట్యాగ్..?

పూజా హగ్దే కు మళ్లీ ఐరెన్ లెగ్ ట్యాగ్ తగిలిస్తున్నారా..? అంటే అవుననే తెలుస్తుంది కెరియర్ మొదట్లో వరుస ప్లాప్స్ తో ఐరెన్ లెగ్ అనిపించుకున్న పూజా..ఆ తర్వాత తెలుగు లో డీజే తో హిట్ కొట్టి మొదటి సక్సెస్ రుచి చూసింది. ఆ తర్వాత అమ్మడికి వరుస ఛాన్సులు ఇచ్చేందుకు నిర్మాతలు ముందుకు రావడం..చేసిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ కావడం తో స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లింది.

కానీ ఈ ఏడాది మాత్రం అమ్మడికి వరుస ప్లాప్స్ పడ్డాయి. ఏడాది ప్రారంభం లో ప్రభాస్ తో చేసిన ‘రాధే శ్యామ్’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచింది. తమిళనాట విజయ్ సరసన ‘బీస్ట్’ మూవీ లో నటించింది. ఈ మూవీ తమిళనాడు బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత ఆమె చేసిన ‘ఆచార్య’ చిత్రం కూడా ఎంత పెద్ద డిజాస్టర్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ కూడా ఢమాల్ అన్నది. బాలీవుడ్ క్రేజీ స్టార్ రణ్వీర్ సింగ్ తో కలిసి ‘సర్కస్’ అనే సినిమా చేసింది. రోహిత్ శెట్టి డైరెక్ట్ చేసిన ఈ మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఇలా వరుసగా ఫ్లాప్స్ రావడం తో పూజ హెగ్డే పని ఇక అయిపోయింది అని..ఐరెన్ లెగ్ అని అనడం స్టార్ట్ చేశారు. మరి త్రివిక్రమ్ – మహేష్ మూవీ లో ఈమె నటిస్తుండడం తో అభిమానులు ఖంగారు పడుతున్నారు. మరి ఆ సినిమా రిజల్ట్ ఏమవుతుందో చూడాలి.

follow us