పుష్ప టీమ్ లో కరోనా తో ఒక్కరు మృతి ! అయోమయంలో బన్నీ ?

పుష్ప టీమ్ లో కరోనా తో ఒక్కరు మృతి ! అయోమయంలో బన్నీ ?

త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన చిత్రం “అల వైకుంటపురంలో”. ఈ సినిమా ఘన విజయంతో తన తదుపరి సినిమాను సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఎర్రచందనం స్మగ్లర్ గా బన్నీ ఈ చిత్రంలో కనిపించనున్నాడు. రష్మిక మందన్నా కథానాయకిగా నటిస్తుంది. రెండు రోజుల క్రితం వరకు ఈ చిత్రం యొక్క షూటింగ్ ఆంధ్రప్రదేశ్ లోని మారేడు మిల్లీ అడవిలో జరిగింది. ఎక్కువ మంది సభ్యులతో షూటింగ్ చెయ్యడం వలన అందులో కొంత మందికి కరోనా సోకడంతో అక్కడి లోకేషన్ కి ప్యాకప్ చెప్పి హైదరాబాద్ కు వచ్చేసింది.

తాజా సమాచారం మేరకు “పుష్ప” టీమ్ లో ఓ సభ్యుడు కరోనా తో మృతి చెందడంతో… దర్శకుడు, ఆ చిత్రా నిర్మాతతో సహా అందరూ సెల్ఫ్ ఇసోలేషన్ కు వెళ్లారు .మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారికా మ్యారేజ్ ఈ నెల 9న రాజస్తాన్, ఉదయ్ పూర్ లోని ఉదయ్ విలాస్ లో జరుగుతుంది. ఇప్పటికే మెగా కజీన్స్ అక్కడకు చేరుకుని పార్టీలతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ నిహారికా మ్యారేజ్ కి వస్తాడా లేక సెల్ఫ్ ఇసోలేషన్ కి వెళ్తాడా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంపై అల్లు అర్జున్ నుండి అధికారిక ప్రకటన రావలిసి ఉంది. పుష్ప చిత్రా విషయానికి వస్తే “పుష్ప” లో పుష్పరాజ్ అనే లారీ డ్రైవరు పాత్రలో కనిపిస్తాడు. చాలా రోజుల తర్వాత దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం గా పుష్ప వస్తుంది.

follow us