ప్లాప్ ఇచ్చిన డైరెక్టర్స్ తో ఎన్టీఆర్ మూవీస్ చేయబోతున్నాడా..?

ప్లాప్ ఇచ్చిన డైరెక్టర్స్ తో ఎన్టీఆర్ మూవీస్ చేయబోతున్నాడా..?

చిత్రసీమలో ఏ హీరో అయినా ప్లాప్ ఇచ్చిన డైరెక్టర్ కు మరో ఛాన్స్ ఇచ్చేందుకు కాస్త వెనకడుగు వేస్తారు. కానీ ఎన్టీఆర్ మాత్రం తనకు వరుస ప్లాప్స్ ఇచ్చిన డైరెక్టర్స్ కు మరో ఛాన్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడట. ప్రస్తుతం ఈ వార్త అభిమానులను కలవరపాటుకు గురి చేస్తుంది.

ఎన్టీఆర్ – మెహర్ రమేష్ కలయికలో కంత్రి , శక్తి సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అయ్యాయి. అలాగే ఎన్టీఆర్ – సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో అశోక్, ఊసరవెల్లి సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకున్నాయి. తారక్ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో దమ్ము సినిమా తెరకెక్కగా మాస్ ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చినా బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేదు. బాలయ్యకు హ్యాట్రిక్ హిట్లు ఇచ్చిన బోయపాటి శ్రీను తారక్ తో మరో సినిమాకు పని చేసి తారక్ కు హిట్టివ్వాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఇక హరీష్ శంకర్ తో రామయ్య వస్తావయ్యా అనే సినిమా చేసాడు. ఈ మూవీ ప్లాప్ అయ్యింది. ఎన్టీఆర్ – సంతోష్ శ్రీనివాస్ కాంబోలో రభస మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. ఇలా ఇంతమంది తో ఎన్టీఆర్ ప్లాప్స్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ డైరెక్టర్స్ కు మరో ఛాన్స్ ఇచ్చేందుకు డిసైడ్ అయ్యాడట. ఇప్పటికే కథలు సిద్ధం చేయమని చెప్పినట్లు ఫిలిం సర్కిల్లో ప్రచారం జరుగుతుంది. మరి ఈసారైనా వీరు ఎన్టీఆర్ కు హిట్ ఇస్తారో లేదో చూడాలి.

follow us

Related News