‘భవదీయుడు భగత్‌సింగ్’ కు పవన్ కథ అందిస్తున్నాడా..?

‘భవదీయుడు భగత్‌సింగ్’ కు పవన్ కథ అందిస్తున్నాడా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేవలం నటుడు మాత్రమే కాదు సింగర్ , ఫైటర్ , డైరెక్టర్ , స్క్రీన్ ప్లే రైటర్ , రాజకీయ నేత ఇలా అన్ని కోణాలు ఉన్నాయి. అందుకే ఆయన అంటే అందరికి అభిమానం. ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాల్లో బిజీ గా ఉన్న ఈయన మరోసారి రైటర్ గా మారబోతున్నారనే వార్తలు ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్లో హరిహర వీరమల్లు అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ మొదలుపెట్టి చాలా నెలలే కావొస్తున్నా ఇంకా పూర్తి కాలేదు. మధ్యలో భీమ్లా నాయక్ రావడం , తర్వాత రాజకీయాలతో బిజీ కావడం తో హరిహర వీరమల్లు పూర్తి కావడం ఆలస్యం అవుతుంది. ఫిబ్రవరి కల్లా పూర్తి చేసి..హరీష్ శంకర్ మూవీ ని సెట్స్ పైకి తీసుకరావాలని చూస్తున్నాడు పవన్.

గతంలో పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కలయికలో గబ్బర్ సింగ్ మూవీ వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దీంతో వీరిద్దరి కాంబో అనగానే అంచనాలు తారాస్థాయి లో ఉన్నాయి . ఈ మూవీ ప్రకటించి కూడా చాల నెలలే అవుతుంది. సెట్స్ ఫై ఉన్న హరిహర వీరమల్లు ను పూర్తి చేసి..హరీష్ డైరెక్షన్లో చేయబోయే ‘భవదీయుడు భగత్‌సింగ్’ ను సెట్స్ ఫైకి తీసుకరావాలని చూస్తున్నారు. అయితే ఈ సినిమాకు పవన్‌ కథను అందించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా కథా రచనలో పవన్‌ కూడా భాగమవుతున్నాడని అంటున్నారు. పవన్‌ సినిమాలకు కథ అందించడం ఇదే మొదటిసారి కాదు గతంలో.. ‘జానీ’, ‘సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌’ సినిమాలకు పవన్‌ కథ అందించగా, ‘గుడుంబా శంకర్‌’ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందించిన విషయం తెలిసిందే. నిజంగానే హరీష్ మూవీకి కథ సాయం అందిస్తున్నాడా..అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది.

follow us