ఫ్యాషన్ డిజైనర్ తో ప్రదీప్ పెళ్లికి సిద్దం..?

ఫ్యాషన్ డిజైనర్ తో ప్రదీప్ పెళ్లికి సిద్దం..?

టాలీవుడ్ బుల్లితెర ఫై ప్రభాస్ పెళ్లి గురించే ఎలాగైతే చర్చ జరుగుతుందో..బుల్లితెర ఫై ప్రదీప్ మాచిరాజు పెళ్లి గురించి అంతే చర్చ నడుస్తుంటుంది. ఆ మధ్య ప్రదీప్ పెళ్లి కోసం ఒక రియాల్టీ షో నే నిర్వహించారు.అయితేఆ షో చాలా పెద్ద వివాదం అవ్వడంతో మధ్యలోనే ఆపేసారు. ఆ తర్వాత కూడా పలుమార్లు ప్రదీప్ పెళ్లి గురించి చర్చ నడుస్తూనే ఉంటుంది.

తాజాగా ఓ ఫ్యాషన్ డిజైనర్ తో ప్రదీప్ పెళ్లికి సిద్దం అయ్యాడనే వార్త ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. సదరు ఫ్యాషన్ డిజైనర్ బుల్లితెర సీరియల్ నటి నటులకు ఫ్యాషన్ డిజైనర్ గా వర్క్ చేస్తుందని , అలాగే బిగ్ బాస్ షో ఇంటి సబ్యులకు కూడా ఈమె ఫ్యాషన్ డిజైనర్ గా వర్క్ చేస్తుందని అంటున్నారు. కాగా ఈమె సోషల్ మీడియా కు దూరంగా ఉన్నప్పటికీ , చాలామందికి సుపరితురాలే అని అంటున్నారు.

ఇప్పుడు ఆ ఫ్యాషన్ డిజైనర్ తో ప్రదీప్ పెళ్లికి సిద్దం అయ్యాడు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరి పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెపుతున్నారు. మరి నిజంగా ప్రదీప్ ఆమెను పెళ్లి చేసుకుబోతున్నాడా..? లేదా అనేది అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

follow us