మల్లారెడ్డి కేసును ఈడీ చూసుకోవాలని ఐటీ లేఖ

మల్లారెడ్డి కేసును ఈడీ చూసుకోవాలని ఐటీ లేఖ

గత కొద్దీ నెలలుగా తెలంగాణ లో ఐటీ, ఈడీ రైడ్స్ కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా టిఆర్ఎస్ నేతలే టార్గెట్ అన్నట్లు సోదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే మంత్రి గంగుల గురువారం ఢిల్లీ ఈడీ ముందు హాజరుకాగా..రీసెంట్ గా మంత్రి మల్లారెడ్డి కి సంబదించిన ఆస్తులపై సోదాలు జరిపారు. మల్లారెడ్డి తో పాటు ఆయన కుమారులు , అల్లుడు , బంధువుల ఇళ్లలోనూ సోదాలు జరిపి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే మల్లారెడ్డి తో పాటు కుమారులు , అల్లుడు , కాలేజ్ సిబ్బందిని విచారించిన ఐటీ అధికారులు..తాజాగా ఈ కేసును ఈడీ చూసుకోవాలని లేఖ రాసారు.

మెడికల్​ సీట్లు, డొనేషన్ల విషయంలో మల్లారెడ్డి అవకతవకలకు పాల్పడ్డారని .. దీనిపై పూర్తి దర్యాప్తు చేయాలని ఈడీని కోరింది. మనీలాండరింగ్​ కోణంలోనూ ఇన్వెస్టిగేషన్ జరపాలని సూచించింది. ఈడీ విచారణ జరిగితే అవకతవకలకు సంబంధించిన మరిన్ని విషయాలు బయటపడే చాన్స్​ ఉంటుందని లేఖలో పేర్కొంది. తాము ఇప్పటివరకు నిర్వహించిన సోదాల్లో సేకరించిన ఆధారాలను కూడా ఈడీకి ఐటీ శాఖ పంపించింది. ఈమేరకు తాము జరిపిన సోదాలకు సంబంధించిన పూర్తి నివేదికతో ఈడీకి ఐటీ శాఖ లేఖ రాసింది. మరి ఐటీ లేఖ బట్టి ఈడీ ఈ కేసును టేకప్ చేస్తుందా..లేదా అనేది చూడాలి.

follow us

Related News