మైత్రి మూవీ మేకర్స్ కు షాక్ ఇచ్చిన ఐటీ అధికారులు

మైత్రి మూవీ మేకర్స్ కు షాక్ ఇచ్చిన ఐటీ అధికారులు

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కు ఐటీ అధికారులు షాక్ ఇచ్చారు. గత కొద్దీ రోజులుగా ఐటీ అధిఅక్రూలు సినీ , రాజకీయ , బిజినెస్ నేతలను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ లపై ఐటీ అధికారులు ఏక కాలంలో దాడులు నిర్వహించారు. దాదాపు 15 బృందాలు సోదాలు చేయడం చేసారు.

ప్రస్తుతం ఇండస్ట్రీ లో టాప్ బ్యానర్ గా మైత్రి మూవీ మేకర్స్ ఎదిగారు. వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలు నిర్మిస్తూ భారీగా లాభాలు అందుకుంటున్నారు. ప్రస్తుతం వీరు చిరంజీవి తో వాల్తేరు వీరయ్య , బాలకృష్ణ తో వీర సింహ రెడ్డి చిత్రాలు నిర్మించారు. ఈ రెండు మూవీస్ సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అలాగే అల్లు అర్జున్ తో పుష్ప 2 నిర్మిస్తున్నారు. దీంతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేయబోతున్నారు. ఇలా వరుస వరుస అగ్ర హీరోల సినిమాలు భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండడంతో ఐటీ కన్ను వీరి ఫై పడింది.

follow us