‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ గత నెల 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకోవడమే కాదు..బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఏ ఆర్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌ తో కలిసి హాస్య మూవీస్‌పై రాజేష్ దండా నిర్మించారు. ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని సొంతం చేసుకున్న జీ5, క్రిస్మస్ కానుకగా ఈ నెల 23 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది.

రాజకీయ వ్యవస్థను ప్రశ్నించడం అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన ఈ సినిమాలో ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ అధికారిగా అల్లరి నరేష్ అద్భుత నటనను కనబరిచాడు. మారేడుమిల్లి నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంటుంది. తొలుత ఈ సినిమాని ఓటీటీలో వచ్చే ఏడాది విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే, ఫ్యాన్స్ రిక్వెస్ట్ వల్ల ముందే విడుదల చేస్తున్నారు. ఆనంది కథానాయికగా నటించగా ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించగా , రాంరెడ్డి సినిమాటోగ్రాఫర్ గా, అబ్బూరి రవి మాటలు , బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేసారు.

follow us

Related News