వకీల్ సాబ్ నుంచి మరో అప్డేట్

  • Written By: Last Updated:
వకీల్ సాబ్ నుంచి మరో అప్డేట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాలీవుడ్‌లో మంచి హిట్ టాక్ సంపాదించిన పింక్ రీమేక్‌ ‘వకీల్ సాబ్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా, అంజలి, అనన్య, నివేదా థామస్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా సంక్రాంతికే రిలీజ్ అవుతుందని అభిమానులు ఆశించినప్పటికి అది కాస్త వాయిదా పడింది. అయితే కనీసం సంక్రాంతి రోజు ఈ సినిమా నుంచి ఏదైనా అప్ డేట్ ఉంటే బాగుంటుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర యూనిట్ అదిరిపోయే గుడ్‌న్యూస్ అందించింది. జనవరి 14 సంక్రాంతి సందర్భంగా సాయంత్రం 6.03 గంటలకు ‘వకీల్ సాబ్’ టీజర్ విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. తాజాగా మరో పోస్టర్ ను రిలీజ్ చేస్తూ వకీల్ సాబ్ సినిమా షూటింగ్ పూర్తిస్థాయిలో కంప్లీట్ అయినట్లుగా తెలిపింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులపై పడినున్నట్లుగా తెలుపుతూ, టీజర్ రెడీ అవుతున్నట్లుగా పోస్టర్ ద్వారా తెలిపింది చిత్రబృందం.

follow us