నేను చేసిది సిల్క్‌ బయోపిక్‌ కాదు !

నేను చేసిది సిల్క్‌ బయోపిక్‌ కాదు !

జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ అనసూయ సినిమాల్లో కీలక పాత్రలో నటిస్తూ మరో వైపు టీవీ షో లో యాంకర్ గా రానిస్తుంది .సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం చిత్రంలో రంగమత్త పాత్ర ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. అలనాటి ఐటెమ్ గర్ల్ సిల్క్ స్మిత బయోపిక్ ను తమిళ్ లో “అవల్ అప్పడితన్” పేరుతో కే‌ఎస్ మణికంధన్ దర్శకత్వంలో చిత్రీకరించనున్నారు. ఇక బయోపిక్ లో జబర్దస్త్ యాంకర్ అనసూయ నటిస్తుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా అనసూయ ట్విటర్ ద్వారా సమాధానం ఇస్తూ సిల్మ్ స్మిత బయోపిక్ లో నేను నటించడం లేదు అంటూ పోస్ట్ చేసింది. ఆ వార్తాతో అనసూయ సిల్క్ స్మిత బయోపిక్ కు ఫుల్ స్టాప్ పడింది. బాలీవుడ్ లో విద్యా బాలన్ లీడ్ రోల్ లో సిల్క్ స్మిత జీవిత చరిత్రను “ది డర్టీ పిక్చర్” పేరుతో మిలాన్ లాతురీయ దర్శకత్వంలో వచ్చింది. ఆ చిత్రం తెలుగు, తమిల్ బాషల్లో విడుదలై మంచి వసూళ్లు చేసింది. మరోసారి ఇదే బయోపిక్ ను తమిళ్ లో చెయ్యడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనసూయ నో చెప్పడంతో.. ఆ పాత్రలో మరో హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అనేది ఆసక్తి గా మారింది.

follow us