జబర్దస్త్ కమెడియన్ ఇంట పెండ్లి సందడి

  • Written By: Last Updated:
జబర్దస్త్ కమెడియన్ ఇంట పెండ్లి సందడి

జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ ఇంట పెండ్లి సందడి మొదలైంది. తాను పెండ్లి చేసుకోకుండా ముందు తమ్ముడికి పెండ్లి చేస్తున్నాడు ఈయన. గతంలో సుడిగాలి సుధీర్ కూడా ఇదే చేశాడు. ఇప్పుడు రాకేష్ కూడా ఇదే చేస్తున్నాడు. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమ్ముడి పెండ్లికి సంబంధించిన ఫొటోలను తానే ఫేస్ బుక్ పేజీలో అప్‌లోడ్ చేశాడు రాకేష్. ఇవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ముందుగా పెండ్లి కొడుకు ఫంక్షన్ చేస్తున్నారు. ఇందులో కుటుంబ సభ్యులంతా ఈ వేడుకకు వచ్చి నూతన వరుడిని ఆశీర్వదించారు. రాకేష్‌కు అత్యంత సన్నిహితుడు అయిన యాంకర్ రవి కూడా ఈ వేడుకలో పాల్గొన్నాడు. ఆయనతో పాటు బిగ్ బాస్ ఫేమ్ సుజాత కూడా వచ్చింది. అలాగే మరో లేడీ కమెడియన్ రోహిణి కూడా వచ్చింది. సునామీ సుధాకర్, లెజెండరీ కొరియోగ్రఫర్ శివశంకర్ మాస్టర్‌తో పాటు చాలా మంది రాకేష్ తమ్ముడి పెళ్లి వేడుకకు వచ్చారు.

follow us