పెళ్లి చేసుకుని తప్పు చేశానన్న కమెడియన్.. అతడి భార్యకు కాల్ చేసిన సుమ

పెళ్లి చేసుకుని తప్పు చేశానన్న కమెడియన్.. అతడి భార్యకు కాల్ చేసిన సుమ

“జబర్దస్త్” షో ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చింది. ఎంతో మంది కమెడియన్స్ ను సినిమా తెరకు పరిచయం చేసింది అందులో ముఖ్యమైన వారిలో, “సుడిగాలి సుధీర్. గెటప్ శ్రీను, అది, మహేష్, ఆటొ రాంప్రసాద్, చమక్ చంద్ర”. ఇంకా ఎంతో మంది బుల్లి తెరపై వచ్చే కామిడీ షోని బేస్ చేసుకుని నటులుగా, కమెడియన్స్ గా రానిస్తున్నారు. “జబర్దస్త్ “మహేష్ కూడా “రంగస్థలం”, “మహానటి”, “గుణ 369” , “యాత్ర” వంటి సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

సుమ “క్యాష్” ప్రోగ్రాం కి మహేష్, వైవా హర్ష, జోష్ రవి, సుదర్శన్ లు గెస్ట్ లుగా వచ్చారు. సుమ తన పంచులతో ఆ షోని అలరించింది. ముఖ్యంగా మహేష్, వైవా హర్ష లపై వేసిన పంచులు ఆ ఎపిసోడ్ కి హైలెట్ గా నిలిచాయి. సుమ బాస్కెట్ బాల్ గేమ్ లో బాగంగా మహేష్ ని కొన్ని ప్రశ్నలు వేసింది. అందులో ముఖ్యంగా ఒక్కటి బాగా పేలింది అది. మీరు జీవితంలో చేసిన పెద్ద తప్పు ఏమిటి ? కమెడియన్ గా మారడం, రెండు పెళ్లి చేసుకోవడం. అంటూ రెండు ఆప్షన్స్ తో కూడిన ప్రశ్న వేసింది.

వెంటనే మహేష్ ఏ మాత్రం మాట తడబడకుండా పెళ్లి చేసుకుని తప్పు చేశాను అన్నాడు. ఆ తరువాత సుమ మహేష్ భార్య కు ఫోన్ చేసి మీవారు ఎలాంటి వారు అనగా.. ప్రపంచంలో ఆయన ఉత్తమ భర్త అంటూ జవాబు ఇచ్చింది.

follow us